చెన్నై: తమిళనాడులో రోజు రోజుకు కొత్త కేసులు పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ రోజు కొత్తగా 600 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, చెన్నై నగరంలోనే 399 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగించే విషయమని దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,009కి చేరింది. చెన్నైలో 3,035 మంది కరోనా బాధితలుండగా చెన్నై కోయంబేడు మార్కెట్లోనే 1,589 కేసులు నమోదయ్యానని ఈ రోజు మృతి చెందిన ముగ్గురితో కలిపి రాష్ట్రంలో 40 మంది కరోనాతో చనిపోయారని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ తెలిపారు.
మరోవైపు కర్ణాటకలో కొత్తగా 48 కరోనా కేసులు నమోదైనట్లు కర్ణాటక ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 753కు పెరిగిందని, వీరిలో 376 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 347 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. కాగా కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 3,390 కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు కేంద్రం ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తానికి దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 56,342కు పెరిగాయని, మరణాల సంఖ్య 1,886కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..