న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించగా.. ఆ లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తూ కొంతమంది రోడ్లపైకి వస్తున్నారు. పోలీసులు నయాన్నో భయాన్నో నచ్చచెప్పి వెనక్కి పంపిస్తున్నా... అక్కడక్కడా లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి వీధుల్లోకి వచ్చే వారు వస్తూనే ఉన్నారు. పోలీసులు ఎంత విజ్ఞప్తి చేసినా... ప్రభుత్వాలు, ప్రముఖులు ఎన్ని రకాలుగా చెప్పినా.. నిత్యం ఏదో ఓ చోట లాక్ డౌన్ ఉల్లంఘన ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు సైతం తమదైన స్టైల్లో ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. రోడ్లపైకి వచ్చే వారిని అడ్డుకోవడం కోసం.. వారిలో కరోనాపై అవగాహన కల్పించడం కోసం పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
Also read : ఒకే ఆస్పత్రిలో 33 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్
అందులో భాగంగానే కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వచ్చందంగా ముందుకొచ్చిన కొంతమంది వాల్యూంటీర్స్‌కి ఢిల్లీ పోలీసులు ఇదిగో ఇలా పీపీఈ కిట్స్‌తో పాటు కరోనా వైరస్ నమూనాను పోలి ఉండే హెల్మెట్స్ ఇచ్చి వీధుల్లోకి పంపిస్తున్నారు. ప్రజలు ఎవరైనా రోడ్లపైకి వస్తే.. వారిని భయపెట్టి ఇంటికి వెనక్కి పంపడమే ఈ కరోనా వైరస్ వాల్యూంటీర్స్ పని.
#WATCH Delhi: As part of awareness drive initiated by Delhi Police, volunteers wearing symbolic #Coronavirus helmets appeal to people in Dwarka to stay at home amid #CoronavirusLockdown. pic.twitter.com/tnp3gIK0kD
— ANI (@ANI) April 27, 2020
ఢిల్లీ శివార్లలోని ద్వారకాలో కరోనా వైరస్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని వాల్యుంటీర్స్ భయపెట్టి వారిని తిరిగి వెనక్కి పంపిస్తుండగా కెమెరాకు చిక్కిన ఈ దృశ్యాలను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. విచిత్రం ఏంటంటే... ప్రజల శ్రేయస్సు కోసమే ఓ వాల్యుంటీర్ ఇంత చేస్తోంటే... ఓ పెద్దావిడ మాత్రం ఆయన్ని తన మొబైల్ కెమెరాతో చిత్రీకరిస్తూ అక్కడే నిలబడటం చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఆ పెద్దావిడకు ఎలా చెప్పాలో అర్థం కానీ ఆ వాల్యుంటీర్ ఆఖరికి ఆమెకు చేతులెత్తి దండం పెట్టడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..