'కరోనా వైరస్'ను ఎదుర్కోవాలంటే .. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాత్ర చాలా కీలకం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వారిని అంతా దేవునితో సమానంగా చూస్తున్న పరిస్థితి ఉంది. అలాంటిది పాకిస్తాన్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది.
ఊరందరిదీ ఒక దారైతే ఉలిపి కట్టది ఒక దారి అన్నట్లు .. పాకిస్తాన్ వైఖరి భిన్నంగా ఉంది. కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు ప్రపంచ దేశాలు పోరాడుతుంటే .. పాకిస్తాన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఇతర దేశాల్లో ఉన్న పాకిస్తానీలను స్వదేశానికి రావొద్దని.. ఇక్కడ ఎలాంటి సదుపాయాలు అందుబాటులో లేవని తెగేసి చెప్పింది ఇమ్రాన్ సర్కార్. తాజాగా ఇరాన్ నుంచి వచ్చిన యాత్రికులను తమ దేశంలోకి అనుమతించకుండా .. వారి మానాన వారిని పాక్ ఆక్రమిత కాశ్మీర్.. POKలో వదిలేసింది.
ఇప్పటికే POK... 215 కరోనా పాజిటివ్ కేసులతో సతమతమవుతోంది. ఇరాన్ యాత్రికులను అక్కడికి పంపించడంతో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు POKలో మరో ఉపద్రవం వచ్చి పడింది. వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. పైగా వైద్యులు కూడా ఆందోళనకు దిగారు. తమకు ప్రభుత్వం కనీసం పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్.. PPE కిట్లు ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి ఎక్విప్ మెంట్లు లేకుండా తాము ఎలా వైద్యం చేయగలమని ప్రశ్నిస్తున్నారు.
ముజఫరాబాద్ లోని అంబోర్ ఆస్పత్రిలో వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. కేవలం 40 మందికి కిట్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని వారు చెబుతున్నారు. ప్రభుత్వం తమను మరణం దిశగా పంపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇంత హీనస్థితిలో ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. కనీసం 40 PPE కిట్లు లేకుండా ఆస్పత్రి ఎలా నడిపించాలని అడుగుతున్నారు. ఇప్పటికైనా
తమకు PPE కిట్లు అందించనిపక్షంలో తాము విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
POKలో వైద్యుల నిరసన