కోల్‌కతా : లాక్డౌన్ కారణంగా మద్యం అమ్మకాలు లేవని ఆందోళన చెందుతున్న వారికి పశ్చిమ బెంగాల్ సర్కార్ త్వరలోనే ఓ శుభవార్త వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. లాక్డౌన్ సమయంలోనూ మద్యం హోమ్ డెలివరీకి అనుమతించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. మద్యం కౌంటర్ సేల్స్‌కి వీలు లేకుండా కేవలం ఆన్లైన్లో అందినటువంటి ఆర్డర్స్‌ని మాత్రమే మద్యం షాపుల నుంచి నేరుగా హోం డెలివరీ చేయనున్నట్టు అక్కడి ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏ పోలీసు స్టేషన్ పరిధిలోకి అయితే మద్యం దుకాణాలు వస్తాయో... ఆ పోలీసు స్టేషన్ నుంచే ఆయా మద్యం దుకాణాదారులు మద్యం హోం డెలివరీని సూచించే పాసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో మద్యం దుకాణానికి మూడు డెలివరీ పాస్‌లు మాత్రమే జారీ అయ్యేలా ఏర్పాట్లు అక్కడి ఎక్సైజ్ శాఖ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
Also read : PM Modi about lockdown: లాక్ డౌన్ ఎత్తివేయడంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
మద్యం హోం డెలివరీ కోసం ప్రతీ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య వినియోగదారులు ఫోన్ల ద్వారా లిక్కర్ ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ద్వారా ఆర్డర్ చేసిన వారికి ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మద్యం హోం డెలివరీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని పశ్చిమ బెంగాల్ ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..