'కరోనా వైరస్'.. కరాళ నృత్యం చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా అంతా లాక్ డౌన్ పరిస్థితి కనిపిస్తోంది. జనం అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా 144 సెక్షన్ విధించడం కూడా చూస్తున్నాం.
గుంపుగుంపులుగా ఎక్కడా తిరిగే పరిస్థితి లేదు. మరోవైపు కొద్ది రోజులుగా ఢిల్లీలోని షహీన్ బాగ్ లో పౌరసవరణ వ్యతిరేక చట్టం.. CAAకు వ్యతిరేకంగా నిరసన కొనసాగుతోంది. కరోనా వైరస్ కు భయపడేది లేదని నిరసనకారులు అక్కడే కూర్చుని ఆందోళన కొనసాగించారు. నిన్నమొన్నటి వరకు జనం కాస్త పలుచబడ్డారు. కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఈ కారణంగా ఆందోళన విరమించాలని నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిగా మెత్తబడ్డ ఆందోళన కారులు తమ చెప్పులు వారి వారి స్థానాల్లో పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు ( మంగళవారం ) జనం మరింత పలుచబడ్డారు.
#WATCH Delhi Police clears the protest site in Shaheen Bagh area, amid complete lockdown in the national capital, in wake of #Coronavirus pic.twitter.com/N6MGLTLs5Z
— ANI (@ANI) March 24, 2020
లాక్ డౌన్ ఎఫెక్ట్: దళారుల రాజ్యం
ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి ప్రాంతాన్ని అంతా ఖాళీ చేయించారు. నిరసనకారులను ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. ఆందోళనకారులు ఏర్పాటు చేసుకున్న బల్లలను జేసీబీతో ఎత్తేసి ఇతర ప్రాంతాలకు తరలించారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..