సినిమాల్లోగానీ, రియల్ లైఫ్‌లో గానీ బ్రెయిన్ స్ట్రోక్, లేక బ్రెయిన్ డెడ్ అయిందని వింటూనే ఉంటాం. అయితే ఎలాంటి ఆహారం తీసుకున్నవారికి దీని ప్రభావం ఎక్కువ, బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటో తెలియాలంటే ఈ వివరాలు మీకోసం.. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి వ్యక్తి చనిపోవడాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. అయితే అందరూ అనుకున్నట్లుగా కాకుండా ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ శాకాహారం తినేవారికి ఎక్కువగా వస్తుంటాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చాలాకాలం సర్వే చేసి ఈ వివరాలు తెలిపారు.
మధ్యాహ్నం నిద్ర లాభమా.. నష్టమా? ఏం చేస్తే బెటర్
దాదాపు రెండు దశాబ్దాలపాటు దాదాపు 50వేల మందిపై చేసిన రీసెర్చ్‌లో ఆసక్తికర విషయాలు కనుగొన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం శాకాహారులకే ఎక్కువ అని తేలింది. బ్రిటన్‌లో అందుకే శాకాహారం వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారని తమ అధ్యనంలో ప్రస్తావించడం గమనార్హం. బ్రెయిన్ స్ట్రోక్ మాంసాహారులకన్నా శాకాహారులకే వచ్చే అవకాశం 20శాతం అధికమని పరిశోధకులు చెబుతున్నారు. శాకాహారుల్లో తక్కువ కొలస్ట్రాల్ కారణంగా రక్తం వేగంగా ప్రవహించడంతో రక్తనాళాలు చిట్లిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మితిమీరిన తిండి, వ్యాయామం ఆరోగ్యానికి చేటు.. షాకింగ్ రిపోర్ట్
బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone
కాగా, గుండెపోటు (హార్ట్ స్ట్రోక్) లాంటివి మాత్రం మాంసాహారులతో పోల్చితే శాకాహారులకు వచ్చే అవకాశం 20శాతం తక్కువ. అయితే మాంసాహారులలో కూడా చేపలు తినని వారితే పోల్చితే తినే వారికి గుండెపోటు వచ్చే అవకాశం చాలా తక్కువ అని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో గతంలోనూ ఈ రీసెర్చ్ ఫలితాలను ప్రచురించారు. మాంసాహారుల్లో కొలస్ట్రాల్ (కొవ్వు) ఎక్కువగా ఉండటంతో రక్తప్రసరణ సక్రమంగా జరగక గుండెపోటు వచ్చే అవకాశం ఉందని గుర్తించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..