Daaku Maharaaj child Artist: : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సినిమాలో బాలయ్యతో సరిసమానమైన పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ నటించింది. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో ఆ ఎవరనేది నెట్ అందరు తెగ వెతికేస్తున్నారు. మరి ఈ సినిమాలో బాలనటిగా నటించిన ఆ నటి ఎవరనే విషయానికొస్తే..
Daaku Maharaaj child Artist: ‘డాకు మహారాజ్’ బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ. ఈ చిత్రంలో బాలయ్యతో సమానమైన క్యారెక్టర్ పాప పాత్రకు ఉంది. ఈ సినిమాలో తన క్యూట్ యాక్టింగ్ మెప్పించింది. అంతేకాదు ఈ మూవీ సక్సెస్ లో కీ రోల్ పోషించిన పాప ఎవరనేది ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
‘డాకు మహారాజ్’ సినిమాలో బాలనటిగా నటించి పాప పేరు ‘ వేద అగర్వాల్. పాప తండ్రి మాధవ్. తల్లి మేఘ. వేద తండ్రి గజల్, భజన్ లలో మాస్టర్. రీసెంట్ గా జరిగిన పలు ప్రైవేట్ సినిమా అవార్డ్స్ లో బెస్ట్ సింగర్ గా నామినేట్ అయ్యారు కూడా.
మొత్తంగా ‘డాకు మహారాజ్’ సినిమాలో బాలనటిగా నటించిన వేద అగర్వాల్ తల్లిదండ్రులది మ్యూజిక్ ఫ్యామిలీకి సంబంధించనది కావడం విశేషం. ఈ సినిమాలో బాలయ్యతో ఆమె చేసిన సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి.
డాకు మహారాజ్ సినిమా విషయానికొస్తే.. బాలకృష్ణ కెరీర్ లో మొదటి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా తొలి రోజే రూ. 56 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు రెండు రోజు కూడా రూ. 35 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
‘డాకు మహారాజ్’ సినిమాతో బాలయ్య తన కెరీర్ లో వరుసగా 4వ సక్సెస్ అందుకున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, ‘భగవంత్ కేసరి’ సినిమాలతో హాట్రిక్ హిట్స్ తో జోష్ లో ఉన్నాడు. తాజాగా ‘డాకు మహారాజ్’ సక్సెస్ తో ఇపుడు డబుల్ హాట్రిక్ కు శ్రీకారం చుట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.