PM Modi: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు , సినీ ప్రముఖలు హాజరయ్యారు.
PM Modi: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు , సినీ ప్రముఖలు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. తెలంగాణ సాంప్రదాయాలు ప్రతిబించేలా భిన్నమైన ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ట్విట్టర్ అకౌంట్లో సంక్రాంతి వేడుకలపై స్పందించారు. నా మంత్రివర్గ సహచరుడు కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి సంబురాలకు హాజరయ్యాను. అద్భుతమైన సాంస్క్రుతిక కార్యక్రమాలను వీక్షించాను అని మోదీ తెలిపారు.
సంక్రాంతి పొంగల్ పండగలు భారతీయుల సంస్క్రుతి వ్యవసాయ సంప్రదాయాలు ఎంతో గౌరవించే పర్వాలు అని మోదీ పేర్కొన్నారు.
సంక్రాంతి, పొంగల్ పండగల శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని మోదీ. ప్రజలందరికీ ఆనందం, ఆరోగ్యం కలగాలని రాబోయే రోజుల్లో సమృద్ధి చెందిన పంటలు చేతికి అందాలని ఆకాంక్షించారు.
మోదీ ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను అభిమానులకు షేర్ చేశారు. ప్రజలు విశేష అభిమానం పొందారని.. సంక్రాంతి ఉత్సవాలు ఢిల్లీలో తెలంగాణ సాంప్రదాయలకు మాన్యంగా నిలిచినట్లు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.