Game Changer Piracy:'గేమ్ చేంజర్' రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. యావరేజ్ టాక్ తో మొదలైన ఈ సినిమా విడుదలకు ముందు నుంచి పైరసీ ప్రింట్ లీక్ చేసే కేటు గాళ్ల నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. కోట్లకు కోట్ల రూపాయల ఖర్చుచేసి గ్లోబల్ రేంజ్‌లో మంచి ఇమేజ్ ఉన్న స్టార్ హీరో మూడేళ్లకు పైగా కష్టపడి చేసిన చిత్రం రిలీజైన రోజే పైరసి బారిన పడింది. అంతేకాదు విడుదలైన రోజే నెట్టింట HD ప్రింట్ ప్రత్యక్షమై మేకర్స్ కు పెద్ద షాక్ ఇచ్చింది.ఈ సినిమా పైరసీ బారిన పడట వెనక దాదాపు 45 మందితో కూడిన ఒక ముఠా ఉన్నట్టు చిత్ర బృందం తెలిపింది. 'గేమ్ చేంజర్' రిలీజ్ కు ముందు నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులు కొందరికి సామాజిక మాధ్యమాలు.. అలాగే వాట్సాప్‌లలో కొంత మంది నుంచి బెదింపులు వచ్చాయి. తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.
'గేమ్ చేంజర్' రిలీజ్ కు రెండు రోజుల ముందు చిత్రంలోని కీలక ట్విస్టులను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇక విడుదల తర్వాత హోచ్‌డి ప్రింట్ లీక్ చేయడమే కాదు... టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ప్రేక్షకులకు చేరువయ్యేలా షేర్ చేశారు.'గేమ్ చేంజర్' మూవీ టీమ్ ను బెదిరించిన, పైరసీ ప్రింట్ లీక్ చేసిన 45 మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసింది మూవీ యూనిట్. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి 'గేమ్ చేంజర్' మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారా.. ? పైరసీ ప్రింట్ లీక్ చేశారా? లేదంటే వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది ఇక పై తేలాల్సి ఉంది.
ఈ కేసును టేకప్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత నిజానిజాలు వెలుగులోకి తీసుకొచ్చే పనిలో పడ్డారు. సామాజిక మాధ్యమం (ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్) పేజీలలో ఒక పథకం ప్రకారం 'గేమ్ చేంజర్' మీద పలువురు నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటు కీలకమైన ట్విస్టులు రివీల్ అయ్యేలా చేసి ప్రేక్సఖులు సినిమాను ఎంజాయ్ చేయకుండా చేశారు. సదరు పేజీల మీద కూడా కంప్లైంట్స్ నమోదు చేశారు. త్వరలో ఆ సోషల్ మీడియా పేజీల మీద కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలియచేశారు.
ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.