Daaku Maharaaj Twitter Review: డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూ.. 'నీకు గుడి కట్టాలి సామీ'

Daaku Maharaaj Twitter Review and Public Talk: డాకు మహారాజ్‌ మూవీ సంక్రాంతి సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు బాలయ్య. ట్రైలర్‌తో భారీ అంచనాలు పెంచేసిన ఈ మూవీ.. నేడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ట్విట్టర్‌లో టాక్ ఎలా ఉందో చూద్దాం పదండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 12, 2025, 05:33 AM IST
Daaku Maharaaj Twitter Review: డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూ.. 'నీకు గుడి కట్టాలి సామీ'

Daaku Maharaaj Twitter Review and Public Talk: నందమూరి బాలకృష్ణ హీరోగా.. బాబీ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'డాకు మహారాజ్‌'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా యాక్ట్ చేయగా.. శ్రద్దా శ్రీనాథ్‌ కీలక పాత్ర పోషించారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ హిట్స్‌తో బాలయ్య జోరు మీద ఉండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను నేడు (జనవరి 12) ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల స్పెషల్ షోలు పడ్డాయి. మరి డాకు మహారాజ్‌తో బాలయ్య మరో హిట్ అందుకున్నాడా..? ట్విట్టర్‌లో ఫ్యాన్స్ ఏమంటున్నారు..? ఓ లుక్కేద్దాం పదండి. 

"ప్రపంచవ్యాప్తంగా ఉరుములతో కూడిన చప్పట్లు వినబడుతున్నాయి. సంక్రాంతి బ్లాక్‌బస్టర్ డాకూ మహారాజ్. ప్రతిచోటా మాస్ వేడుకలతో మార్మోగుతోంది. మాస్ ఎలివేషన్స్, పవర్ ప్యాక్డ్ బాలయ్య ఎంట్రీ సీన్స్, థమన్ సెన్సేషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. బాబీ స్టోరీ, డైరెక్షన్‌, టెక్నికల్ స్కిల్స్ అద్బుతం.." అంటూ ట్వీట్ చేస్తున్నారు. "నీకు గుడి కట్టాలి తమన్ .. అసలు ఆ బీజీఏం ఏందీ సామీ.. మంట పుట్టించావ్ బీజీఎం.." అని మెచ్చుకుంటున్నారు.

 

 

 

"డాకూ మహారాజ్ మాస్ ఎంటర్‌టైనర్. సెకండ్ హాఫ్‌లో కొంత వరకు బాగానే వర్కౌట్ అయింది. టెక్నికల్‌గా ఈ మూవీ చాలా బలంగా ఉంది. మాస్ ఎలివేషన్స్ బ్లాక్‌లతో అదిరిపోయాయి. సాలిడ్ మాస్ మూమెంట్స్ ఇవ్వడంలో బాలయ్య-థమన్ కాంబో మరోసారి సక్సెస్ అయింది. దర్శకుడు బాబీ బాలయ్యను ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే సెకండాఫ్‌లో ఒక పాయింట్ తర్వాత సినిమా చాలా ఊహించే విధంగా ఉంటుంది. చివరి 30 నిమిషాలు ల్యాగ్ చేసినట్లు అనిపించింది." అని ఓ నెటిజన్ రివ్యూ రాశాడు. 

 

 

ఓవరాల్‌గా డాకు మహారాజ్‌ మూవీ ట్విట్టర్‌లో పాజిటివ్ టాక్స్ ఎక్కువగా వస్తున్నాయి. తమ అభిమాన హీరో బాలయ్య మరో హిట్ కొట్టేశాడంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. బాలకృష్ణ స్క్రీన్‌ ప్రజెన్స్, ఎలివేషన్స్, నెక్ట్స్ లెవెల్ విజువలైజేషన్.. అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక థమన్ మ్యూజిక్ మరోసారి హైలెట్ అవుతోంది. బాలయ్య అంటే పునకాలు వచ్చేలా మ్యూజిక్ ఇచ్చే థమన్.. ఈసారి అంతకు మించి అనేలా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చాడు. అంతా బాగానే ఉన్నా క్లైమాక్స్ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండు అని మరికొందరు అంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం సంక్రాంతికి ఫుల్ మీల్స్ మూవీ అని హ్యాపీగా ఫీలవుతున్నారు. తెలుగు న్యూస్‌లో మరికాసేపట్లో ఫైనల్ రివ్యూ రానుంది. 

 

 

 

Trending News