Gold Loan Interest Rates: అత్యవసర సమయంలో లోన్ పొందేందుకు బంగారం అద్బుతంగా ఉపయోగపడుతుంది. రుణం కూడా చాలా సులభంగా లభిస్తుంది. డబ్బులున్నప్పుడు తిరిగి బంగారం విడిపించుకోవచ్చు. అయితే మీరు కుదువ పెట్టే బంగారం 18కే నుంచి 22 కే నాణ్యతతో ఉంటే మంచిది. గోల్డ్ లోన్‌లో కొన్ని రకాలుంటాయి. ఏ రకం మంచిది. ఏ బ్యాంకు ఎంత వడ్డీ వసూలు చేస్తుందనేది చెక్ చేసుకుంటే మంచిది. గోల్డ్ లోన్ తీసుకున్నతరువాత తిరిగి చెల్లించే పద్ధతుల్లో బుల్లెట్ రీపేమెంట్ విధానం ఉంటుంది. ఈ విధానంలో రుణం తీసుకున్న వ్యక్తి నుంచి వడ్డీతో పాటు అసలు కలిపి తీసుకుంటారు. రుణం తీర్చేందుకు ఎన్ని నెలలు సమయం తీసుకుంటారో ఆ సమయానికి వడ్డీ లెక్కించి వేస్తారు. బుల్లెట్ రీపేమెంట్‌లో 3,6,12 నెలల వ్యవది ఇస్తుంటాయి బ్యాంకులు. గోల్డ్ లోన్‌పై వడ్డీ అనేది బ్యాంకుని బట్టి మారుతుంది. మనం ఎంతకాలానికి తీసుకుంటున్నామనేది కూడా ఆదారపడి ఉంటుంది.
గోల్డ్ లోన్‌పై ఏ బ్యాంకులో ఎంత వడ్డీ
కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్ వడ్డీ 9 శాతానికి లభిస్తుంది. ఇది కాకుండా ప్రోసెసింగ్ ఫీజు 500 నుంచి 5000 వరకూ ఉంటుంది. ఎస్బీఐలో గోల్డ్ లోన్ వడ్డీ 9 శాతం ఉంటుంది. ప్రోసెసింగ్ ఫీజు 0.50 శాతం. దీనిపై జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడాలో గోల్డ్ లోన్ వడ్డీ కాస్త ఎక్కువ. 9.15 శాతం వసూలు చేస్తుంది. ఫెడరల్ బ్యాంకులో అయితే కేవలం 8.99 శాతానికే రుణం లభిస్తుంది. యూనియన్ బ్యాంకులో గోల్డ్ లోన్ వడ్డీ ఇంకా ఎక్కువ. 9.95 శాతం తీసుకుంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే ఏకంగా 12.25 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. ఇది కాకుండా 0.75 శాతం ప్రోసెసింగ్ ఫీజు చెల్లించాలి.
ఇక ఐసీఐసీఐ బ్యాంకులో గోల్డ్ లోన్ వడ్డీ 9.25 శాతం నుంచి 18 శాతం ఉంటుంది. 2 శాతం ప్రోసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అయితే గోల్డ్ లోన్‌పై 9.30 నుంచి 17.86 శాతం వరకూ వడ్డీ వసూలు చేస్తుంది. ప్రోసెసింగ్ ఫీజు 1 శాతం ఉంటుంది. ఇక కోటక్ మహీంద్రా బ్యాంకులో గోల్డ్ లోన్‌పై వడ్డీ నెలకు 0.88 శాతం ఉంటుంది. ప్రోసెసింగ్ ఫీజు 2 శాతం ఉంటుంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ అయితే గోల్డ్ లోన్‌పై 10.35 శాతం నుంచి 17.05 శాతం వరకూ వడ్డీ వసూలు చేస్తుంది. 1 శాతం ప్రోసెసింగ్ పీజు ఉంటుంది. ముత్తూట్ ఫైనాన్స్‌లో గోల్డ్ లోన్ వడ్డీ అత్యధికంగా ఏడాదికి 22 శాతం ఉంటుంది. సిటీ యూనియన్ బ్యాంక్ అయితే 9.50 శాతం వడ్డీ తీసుకుంటుంది. యాక్సిస్ బ్యాంక్‌లో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 17 శాతం ఉంటుంది. ప్రోసెసింగ్ ఫీజు తక్కువ. 0.5 శాతం ఉంటుంది.
Also read: Fastag Check: సంక్రాంతికి ఊరెళ్తున్నారా, ఫాస్టాగ్ ఓసారి చెక్ చేసుకోండి లేకపోతే ఇబ్బందులే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.