ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించిన చరిత్ర నీది కాదా?

రాష్ట్రంలో అదికార విపక్షాల మధ్య వాడి వేడి వాదనలు రోజు రోజుకూ పెరుగుతూపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. 

Last Updated : Mar 13, 2020, 05:34 PM IST
ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించిన చరిత్ర నీది కాదా?

అమరావతి: రాష్ట్రంలో అదికార విపక్షాల మధ్య వాడి వేడి వాదనలు రోజు రోజుకూ పెరుగుతూపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. పొత్తులకు కూడా కొన్ని సైద్ధాంతిక విలువలు, నియమాలుంటాయని, బీజేపీతో అంటకాగుతున్న జనసేనతో తెలుగుదేశం సీట్ల సర్ధుబాటు చేసుకుంటుంటే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేని స్థానాల్లో జనసేనకు వదిలేశామని టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో ఒక్క మండలమైనా ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఆ పార్టీలో లేదని అన్నారు. 

Also Read: 151 ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీ అక్కడెందుకు పోటీ చేయడం లేదు: టీడీపీ

ఎన్నికల్లో అక్రమాలు, అరాచకాలపై చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. గతంలో వైస్సార్సీపీ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలను భయాందోళనలకు గురిచేసి జెడ్పీలను, ఎమ్మెల్సీ పదవులను దక్కించుకున్నదెవరని ప్రశ్నించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి దిగజారిపోవడంతో వైస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. 

Also Read:  రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై పార్లమెంట్ స్పీకర్‌కు ఫిర్యాదు

ఈ నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై నిందలు వేయడం సరికాదని, అధికార పార్టీ సానుభూతిపరులని ముద్ర వేయడం తగదని అన్నారు. నానాటికి టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి కనపడుతోందని, ఈ క్రమంలో టీడీపీ ఎదుటివారిపై ఎంతకైనా దిగజారుతుందని అన్నారు. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 

Trending News