Daku Maharaj: మామ బాలయ్య ప్రి రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా అల్లుడు?

Nara Lokesh Chief Guest Balakrishna Daaku Maharaaj Pre Release Event: సినిమాల్లో నట సింహం.. రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్న నందమూరి బాలకృష్ణ తాను నటించిన 'డాకు మహారాజ్‌' సినిమాకు అల్లుడు ముఖ్య అతిథిగా రాబోతున్నాడని సమాచారం. మామ ఈవెంట్‌కు అల్లుడు అతిథిగా వస్తే ఇండస్ట్రీలోనూ.. రాజకీయాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.

1 /6

బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌ జోడిగా నటించిన సినిమా 'డాకు మహారాజ్'.

2 /6

ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన డాకు మహారాజ్‌ ఈనెల 12వ తేదీన విడుదల కానుంది.

3 /6

ఈ సినిమా ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ ఏపీలోని అనంతపురంలో నిర్వహించనున్నట్లు సమాచారం.

4 /6

ఈ వేడుకకు బాలయ్య అల్లుడు, మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు చర్చ జరుగుతోంది.

5 /6

ఈ విషయమై ఒకటి, రెండు రోజుల్లో చిత్రబృందం అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ వేడుకకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

6 /6

మామ అల్లుళ్లు ఒకే వేదికపై కనిపిస్తే తెలుగు దేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకునే అవకాశం ఉంది. కాగా వీరిద్దరి కలిసి పంచుకునే వేడుక ప్రత్యేకంగా నిలవనుంది.