South Central Railway Job Notification 2025: సౌత్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగ యువతకు తియ్యని శుభవార్త లెలిపింది. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న రైల్యే స్టేషన్‌లో వివిధ ఖాళీ ఉన్న ఉద్యోగాలకు భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది. జనవరి 1వ తేదిన స్పోర్ట్స్ కోటాలో గ్రూపు C, గ్రూపు D జాబ్స్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అర్హతలను కూడా సూచించింది. అయితే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషల్‌లో ఖాళీగా ఉన్న గ్రూపు C, గ్రూపు D ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. వీటికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఈ నోటిఫికేషన్ నేరుగా సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం దాదాపు 61 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు కేంద్ర వెల్లడించింది. అలాగే అర్హత వివరాలను కూడా వెల్లడించింది.
ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవాలనుకుంటున్నవారు తప్పకుండా 10th తరగతి లేదా ITI, 12వ తరగతి పాస్ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా డిగ్రీ చేసిన వారు కూడా ఈ ఉద్యోగానికి విద్యార్హలే..
రైల్వే నోటిఫికేషన్‌కి సంబంధించిన ఉద్యోగల దరఖాస్తును నేరుగా RRB వెబ్ సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అర్హత వారు దాదాపు 03-02-2025 తేది వరకు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా కనీస వయస్సు పరిమితి కూడా ఉంది. కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాల్సి ఉంటుంది.
ఈ పోస్టులను అప్లై చేసుకునేవారు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో జాబ్ పొందిన అభర్థ్యులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల రూ.20,200 చెల్లిస్తుంది. అంతేకాకుండా ఇతర బెనిఫిట్స్ వర్తిస్తాయని నోటిఫికేషన్‌లో వెల్లడించారు.