తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ అయ్యారు. యూపీఏ ప్రభుత్వంలో.. ఇప్పుడున్న NDA ప్రభుత్వంలోనూ తెలంగాణకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. లేక లేక 60 ఏళ్లకు వచ్చిన అధికారాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు.
Read Also: ఇటలీలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు
కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రెండు కూటములు (యూపీఏ, ఎన్డీఏ) దారుణంగా విఫలమయ్యాయని కేసీఆర్ అన్నారు. ఈ రెండు ప్రభుత్వాలు దేశాభివృద్ధిలో వైఫల్యం చెందాయని విమర్శించారు. పన్ను వసూళ్లలో వాటాలు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోందన్నారు. పైగా కేంద్రం .. రాష్ట్ర ప్రభుత్వానికి దయ చూపిస్తున్నట్లుగా ప్రవర్తిస్తోందన్నారు. ఇందులో కేంద్రం ఔదార్యం ఏమీ లేదని తెలిపారు. జీఎస్టీ రూపంలో వసూలు చేసిన పన్నుల్లో రావాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉందన్నారు. జీఎస్టీ వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం 10 వేల కోట్ల రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. దేశానికి దిశా నిర్దేశం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో ఉందని కేంద్రం గుర్తుంచుకుంటే మంచిదని చురకలంటించారు.
Live: Honourable CM Sri KCR speaking in Legislative Assembly. https://t.co/r8gf7oO9Uq
— TRS Party (@trspartyonline) March 12, 2020