Dhanurmasam: ధనుర్మాసంలో పెళ్లిళ్లు జరగవు... దీని వెనుక ఉన్న ఈ కారణాలు మీకు తెలుసా..?

Dhanurmasam Tradition: ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తుంది. ఈ మాసం విష్ణుదేవుడికి ఎంతో ప్రీతీకరమైందని చెప్తుంటారు. అదే విధంగా ఈ  సమయంలో చేసే పూజలు వేలరెట్లు గొప్ప ఫలితాలను ఇస్తాయంట.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 22, 2024, 07:16 PM IST
  • ధనుర్మాసంలో ఉత్సవాలు..
  • పాశురాలు పఠించాలంటున్న పండితులు..
Dhanurmasam: ధనుర్మాసంలో పెళ్లిళ్లు జరగవు... దీని వెనుక ఉన్న ఈ కారణాలు మీకు తెలుసా..?

Dhanurmasam puja vidhanam: సాధారణంగా మనకు ఉన్న తెలుగు నెలల్లో శివ, కేశవులకు కొన్ని మాసాలు అత్యంత ప్రీతీకరమైనవని చెప్తుంటారు. అందులో శ్రావణం, కార్తీక మాసం, మార్గశిర మాసం, ధనుర్మాసాలు ఆ దేవుడికి ఎంతో ప్రీతీకరమైనవని చెప్తుంటారు. అయితే.. ఈ కాలంలో చేసే పూజలు, వ్రతాలు కూడా అనేక రెట్లు గొప్ప ఫలితాలను ఇస్తాయంట. అయితే.. ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తుంది.  

సూర్యు భగవానుడు.. ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే మధ్య సమయంమే ధనుర్మాసంగా చెప్తుంటారు..అయితే.. ఈ కాలంలో విష్ణుదేవుడ్ని ఆరాధిస్తుంటారు. అయితే.. ఈ సమయంలో మాత్రం పెళ్లిళ్లను అస్సలు నిర్వహించరు. నెల రోజులపాటు తిరుప్పావై ఉత్సవాలను నిర్వహిస్తారు. శ్రీ మహావిష్ణు ప్రీతికోరకు పాశురాలు చదువుతుంటారు. అదేవిధంగా.. ఆండాళమ్మను ప్రత్యేకంగా  కొలుస్తారు.

ఈ మాసంలో పెళ్లిళ్ళు చేయకపోవడానికి శాస్త్రపరమైన, భౌతికపరమైన కారణం కూడా ఉందని తెలుస్తొంది. వాతావరణంలో అనేక మార్పుల కారణంగా ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో విపరీతంగా చలి ఉంటుందంట. అందుకే ఆహారం తీసుకొవడంలో కూడా అనేక మార్పులు వస్తాయంట. అందుకే.. ఈ కాలంలో శుభకార్యాలను నిర్వహించరని చెప్తుంటారు.

ఏడాది పాటు ఆదేవుడ్ని కోలిచే సమయంలేని వారు.. కనీసం ఏడాది చివరన.. ఈ మాసంలో ఆ దేవుడ్ని కోలుచుకుంటారని కూడా.. ఈ మాసంలో పెళ్లిళ్లు నిర్వహించరని చెప్తుంటారు. అందుకే ధనుర్మాసంను శూన్య మాసం అంటారు. అదే విధంగా..ఈ మాసంలో కేవలం విష్ణుమూర్తిని ఆరాధిస్తు..ఆండళ్ అమ్మవారిని పాశురాలతో అర్చిస్తే.. వారిజీవితంలో అనేక ఉన్నత స్థానాలకు ఎదుగుతారని కూడా చేప్తుంటారు.

Read more: Lord Shanidev: శనిదేవుడికి నూనెతోనే ఎందుకు అభిషేకిస్తారు..?.. దీని వెనుక ఉన్న ఈ పురాణ గాథ మీకు తెలుసా..?

అందుకే శ్రీ మహా విష్ణు ప్రీతీకొరకు విష్ణు సహాస్రనామా పారాయణ, పూజలు, సత్యనారాయణ వ్రతాలు చేస్తే వందరేట్లు మంచి ఫలితాలు కల్గుతాయని కూడా పండితులు చెప్తుంటారు.  ధనుర్మాసంలో గోదాదేవిని కూడా చాలా మంది పూజిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లి కానీ వారు.. ఈ మాసంలో గోదా పారాయణం చేస్తే వెంటనే పెళ్లి అవుతుదంట.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News