Smita Sabharwal: తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా..!..కాళేశ్వరం విచారణలో చుక్కలు చూపించిన స్మిత సబర్వాల్..?..

PC Ghosh  Commission: రేవంత్ సర్కారు మేడిగడ్డ ప్రాజెక్ట్ తో పాటు పలు ప్రాజెక్ట్ లలో జరిగిన అక్రమాలపై పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కమిషన్ ముందు.. సీనియర్ ఐఏఎస్ స్మిత సబర్వాల్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ హజరయ్యారు.

1 /5

 తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఒకవైపు డెవలప్ మెంట్ ఫలాలను ప్రజలకు అందేలే చూస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాల వల్లే.. తెలంగాణ పదేళ్ల పాటు వెనక్కు వెళ్లిపోయిందని పలు సభల్లో ఎద్దేవా చేశారు.  

2 /5

అదే విధంగా గత సర్కారు తాగు నీటి ప్రాజెక్టులంటూ.. భారీగా అక్రమాలకుపాల్పడిందని కూడా రేవంత్ సర్కారు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ముఖ్యంగా.. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల విషయంలో అనేక అక్రమాలు జరిగాయని కూడా కాంగ్రెస్ సర్కారు ఆరోపణలు చేసింది.  

3 /5

దీనిలో  భాగంగా.. ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ ముందు.. మాజీ సీఎస్ సోమేష్ కుమార్, సీనియర్ ఐఏఎస్ స్మిత సబర్వాల్ హజరయ్యారు. ఈ  నేపథ్యంలో వీరిని కమిషన్.. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల విషయంలో ప్రశ్నించినట్లు తెలుస్తొంది.  

4 /5

ముఖ్యంగా గత సర్కారు హయాంలో ఐఏఎస్ స్మిత సబర్వాల్ చాలా కీలకంగా వ్యవహరించారని, సీఎస్ గా సోమేష్ కుమార్ సైతం మేజర్ నిర్ణయాలు తీసుకున్నారని చెబుతుంటారు. అదే విధంగా ప్రస్తుతం దీనిపై పెనుదుమారం చెలరేగిన విషయం తెలిసిందే.  

5 /5

పీసీ ఘోష్ వీరిని.. గతంలో జీవోలు, ప్రాజెక్టుల విషయంలో ఏప్రశ్నలడిగిన కూడా.. తెలియదు.. గుర్తులేదు.. అవగాహాన లేదు.. మర్చిపోయామంటూ.. ఇలానే సమాధానాలు చెప్పారంట. దీంతో పీసీఘోష్ కమిషన్ వీరి ఆన్సర్ లతో విసిగిపోయినట్లు తెలుస్తొంది.