Esther Noronha wedding: టాలీవుడ్ నటి ఎస్తర్ నొరోన్హ రాపర్ నోయెల్ సీన్‌ను ప్రేమించి 2019లో పెళ్లి చేసుకుంది. కానీ వివాహం జరిగిన 16 రోజుల్లోనే విభేదాలు రావడంతో వారు విడిపోయారు. 2020లో విడాకులు పొందిన ఎస్తర్ ప్రస్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉంది.
టాలీవుడ్‌లో మాత్రమే కాక నటిగా బాలీవుడ్‌లో కూడా గుర్తింపు పొందిన నటి ఎస్తర్ నొరోన్హ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. ఆమె 2019లో రాపర్ నోయెల్ సీన్‌ను పెళ్లి చేసుకున్నారు.
అంగరంగ వైభవంగా జరిగిన వారి పెళ్లి ఊహించని విధంగా కేవలం 16 రోజుల్లోనే సమస్యలను ఎదుర్కొంది. ఒక ఇంటర్వ్యూలో ఎస్తర్ మాట్లాడుతూ, "మా పెళ్లి జరిగిన 16 రోజుల్లోనే నోయెల్ నిజమైన స్వభావం నాకు అర్థమైంది. అది నేను అసలు ఉండలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో జీవితాన్ని ముందుకు నడపడం అసాధ్యమని భావించి, విడిపోవాలని నిర్ణయించుకున్నాను," అని చెప్పుకొచ్చారు.
వారు 2020 అక్టోబర్ 31న అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఈ వ్యవహారం అప్పట్లో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంత త్వరగా విడిపోవడంతో దీని గురించి అనేక ప్రశ్నలను మొదలయ్యాయి.
వారి విడాకులకు గల కారణాల గురించి కూడా చాలా పుకార్లు వినిపించాయి కానీ ఇద్దరూ వాటిపై పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. విడాకుల తరువాత కూడా ఎస్తర్ తన సినిమాలతో బిజీగా ఉంది. 2024 ఏప్రిల్‌లో విడుదలైన థ్రిల్లర్ చిత్రం టెనెంట్‌లో ఆమె కీలక పాత్ర పోషించింది.
ప్రస్తుతం ఆమె పలు వెబ్‌సిరీస్‌లు, కొత్త చిత్రాలతో కెరియర్ లో ముందుకు సాగుతోంది. మరోవైపు నోయెల్ కూడా కెరియర్ పరంగా బిజీగానే ఉన్నారు. ఏదేమైనా పెళ్ళైన 16 రోజులకే గొడవలు పడి విడిపోయిన ఎస్తర్ వ్యక్తిగత జీవితం చాలా మందికి షాక్ ఇచ్చింది.