Indraneel Meghana: అత్తను పెళ్లి చేసుకున్న అల్లుడు.. ఇంద్రనీల్‌ మేఘనను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? రియల్‌ లైఫ్‌ లవ్‌ స్టోరీ తెలిస్తే?

Indraneel Meghana Real Life Love Story: ఇంద్రనీల్‌ చక్రవాకం సీరియల్‌ ఎంత పెద్ద హిట్‌ అనేది ఇప్పటికీ తెలుసు. ఆయనకు ఇంకా మరిచిపోలేని గుర్తింపు. అయితే, ఇంద్రనీల్‌ ఆయన వైఫ్‌ మేఘన ఆ సీరియల్‌లో అత్తగా నటించింది. పైగా మేఘన కాస్త లావుగా ఉంటుంది. ఇంద్రనీల్‌ది హీరో పర్సనాలిటీ. అయితే వీళ్లు ఎలా ప్రేమించుకున్నారు? పెళ్లి ఎలా జరిగింది? ఎదురైన కష్టాల గురించి తెలుసుకుందాం.
 

1 /7

బుల్లితెర సీరియల్‌ 'చక్రవాకం' సీరియల్‌తో ఒక్కసారిగా తెలుగు తెరకు పరిచయమై, ఇప్పటికీ స్టార్‌ సీరియల్‌ నటుడిగా గుర్తింపు ఇంద్రనీల్‌ సొంతం.  

2 /7

ఇంద్రనీల్‌ రియల్‌ లైఫ్‌లో సీరియల్‌ నటి మేఘనను పెళ్లి చేసుకున్నారు. ఇది అప్పట్లో పెద్ద  షాక్‌నే మిగిల్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. అతని పర్సనాలిటీ ఏంటి? మేఘన పర్సనాలిటీ ఏంటి?

3 /7

అంతేకాదు ఈ సీరియల్‌ ఇద్దరూ అత్తా అల్లుళ్ల పాత్రను పోషించారు. దీంతో తనే ఆరడుగుల ఇంద్రనీల్‌ను బుట్టలో పడేసిందని అందరూ ఎన్నో మాటలు అన్ననారు. ఇవన్నీ మేఘన లావుగా ఉండటం, ఇంద్రనీల్‌ సన్నగా ఉండటం వల్ల అన్న మాటలు.  

4 /7

కానీ, ఈ జంట ఎందరికో ఆదర్శప్రాయం. మేఘన ఇంద్రనీల్‌ కంటే ఆరు నెలలు పెద్దది. అసలు ఇంద్రనీల్‌ మేఘన వెంటపడి ఒప్పుకునే వరకు వదల్లేదు. చివరకు మేఘన అతని సిన్సియర్‌ ప్రేమను ఒప్పుకోక తప్పలేదు.  

5 /7

ముందుగా మేఘన, ఇంద్రనీల్‌ల ప్రేమను ఇరు కుటుంబాలు అస్సలు ఒప్పుకోలేదు. అప్పుడు చక్రవాకం సీరియల్‌ డైరెక్టర్‌ ఇరు కుటుంబాలను ఒప్పించే ప్రయత్నాలు చేశారు.  

6 /7

అయినా పెద్దలు ఒప్పుకోలేదు. ఇంద్రనీల్‌ ప్రేమను దక్కించుకుని తీరాడు. ఇప్పటికీ వీరి పెళ్లి అయి 20 ఏళ్లు అవుతుంది. వీరు ఎంతో మందికి ఆదర్శ దంపతుల్లా ఇప్పటికీ నడుచుకుంటారు.  

7 /7

వివిధ టీవీ షోలలో ఇప్పటికీ కనిపిస్తారు. సోషల్‌ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటారు. మేఘనకు యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ఉంది. కానీ, వీరికి ఇప్పటికీ ఇంకా పిల్లలు లేరు. వీరి దాంపత్యం అన్యోన్యంగా సాగుతుంది.