స్మార్ట్ ఫోన్ యూజర్లు వాడే సోషల్ మెస్సేజింగ్ యాప్‌లలో వాట్సాప్ కచ్చితంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు మనం మెస్సేజ్ చేస్తున్నా అవతలి వ్యక్తి అది చూశారా లేదో తెలుసుకోలేం. ఎందుకంటే ఆ యూజర్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో రిసీవింగ్ వివరాలు తెలియకుండా ఉండేందుకు కొన్ని ఆప్షన్లు డిజేబుల్ చేసి ఉంటారు. సాధారణంగా అయితే మనం పంపిన మెస్సేజ్ అవతలి వ్యక్తికి డెలివరీ అవ్వగానే సింగిల్ టిక్ మార్క్ పడుతుంది.
See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా
ఒకవేళ రిసీవర్ యూజర్ ఆ మెస్సేజ్ ఓపెన్ చేసి చదివినట్లయితే బ్లూ కలర్ టిక్ మార్క్ వస్తుంది. అయితే ప్రైవసీ సెట్టింగ్స్‌లో బ్లూ టిక్ మార్క్ రాకుండా ఉండేందుకు కొన్ని ఆప్షన్లు డిజేబుల్ చేస్తుంటారు. అలాంటి సమయంలో అవతలి వ్యక్తి మీరు పంపిన మెస్సేజ్, ఫొటోలు చూసినా బ్లూ టిక్ మార్క్ పడదు. కానీ మీకు రిప్లై రావడం చూసి ఆశ్చర్యపోయే వారు ఉంటారు. 2014లో వాట్సాప్ యాజమాన్యం ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
See Photos: ఫొటోషూట్ కోసం టాప్ లేపిన ముద్దుగుమ్మలు!
మీ మెస్సేజ్‌లు అవతలి వ్యక్తి చదివాడో లేదో తెలుసుకునేందుకు ఓ ఉపాయం ఉంది. ఆ వ్యక్తికి మీరు వాయిస్ మెస్సేజ్ చేయండి. ఆ యూజర్ మీ వాయిస్ మెస్సేజ్ విన్నట్లయితే రెగ్యూలర్ అందరి యాప్‌లోలాగానే బ్లూ టిక్ మార్క్ వచ్చేస్తుంది. దీంతో అవతలి వ్యక్తి మీ టెక్ట్స్ మెస్సేజ్ చదివారని, లేక ఫొటోలో చూశారని మీరు గ్రహించవచ్చు. ఇది తెలుసుకున్నప్పటి నుంచీ కొందరు తాము అనుమానం వచ్చిన వారికి మొదట టెక్ట్స్ మెస్సేజ్ చేసి ఎలాంటి బదులు రాకపోతే వాయిస్ మెస్సేజ్ పంపుతున్నారు.
ఈ ఆప్షన్‌తో వాట్సాప్‌లో వారి ఆటలు సాగవు!