ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్ పోలీసులు.. పురోగతి సాధించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో నిత్యం కూంబింగ్ చేస్తున్న పోలీసులకు .. వారు పాతి పెట్టిన మందుపాతర లభ్యమైంది. ఐతే దీన్ని డిఫ్యూజ్ చేసేందుకు వారు ప్రయత్నించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువ. ఇక్కడి అటవీ ప్రాంతం అంతా దట్టంగా ఉండడంతో మావోయిస్టులు .. దాన్ని తమ స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు. ఐతే మావోయిస్టుల వేటలో పోలీసులు ఇక్కడి ప్రాంతంలో నిత్యం కూంబింగ్ లు జరుపుతుంటారు. అలాగే ఇవాళ ఉదయం నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ చోట పోలీసులకు నక్సల్స్ పెట్టిన మందుపాతర లభించింది. దాన్ని.. IED బాంబుగా పోలీసులు గుర్తించారు. వెంటనే దాన్ని నిర్వీర్యం చేశారు. ఈ ఘటన సుక్మా జిల్లాలోని గోలబెకుర్ వద్ద జరిగింది. ఐఈడీ బాంబును పోలీసులు పేల్చేశారు.
#WATCH Sukma: Central Reserve Police Force (CRPF) defused an Improvised explosive device (IED) planted by naxals near Golabekur, earlier today. #Chhattisgarh pic.twitter.com/IfiJ7Q2cf8
— ANI (@ANI) February 19, 2020