Snake Bite: వదల బొమ్మాళీ.. వదల.. ఒకే యువతిని 11 సార్లు కాటేసిన నల్ల పాము.. ఆస్పత్రిలో కూడా..?

Snake viral news: పాము ఆ యువతిపై పాము పగపట్టిందని చెప్పుకుంటున్నారంట. అదే విధంగా ఆమె ఎక్కడికి వెళ్లిన ఆ పాము వెంటాడుతుందని సదరు యువతి బంధువులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

1 /6

సాధారణంగా పాముపగ పన్నేండెళ్లు అంటుంటారు. అందుకు పాముకు అపకారం కల్గజేయకూడదని చెప్తుంటారు. పాములు కన్పిస్తే వాటిని పట్లే వాళ్లకు సమాచారం ఇవ్వండని చెప్తుంటారు. కానీ కొంత మంది మాత్రం పాములకు అపకారం తలపెడుతుంటారు. మరికొందరు మాత్రం.. అనుకొకుండా పాములను కాలితో తొక్కడం వంటివి చేస్తుంటారు. అయితే.. పాములకు ఏదైన అపకారం తలపెట్టినట్లు భావిస్తే అవి వెంటనే కాటు వేస్తాయంట. 

2 /6

ఉత్తర ప్రదేశ్ లోని మహోబా లో  ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది.  చర్ఖారీ తహసీల్‌లోని పంచంపుర గ్రామంలో  ఈ ఘటన జరిగినట్లు తెలుస్తొంది. స్థానికంగా ఉండే.. దల్పత్ అనే వ్యక్తి కూతురు రోష్ణి. ఆమెపై పాము పగబట్టిందంట.  

3 /6

ఈ బాలిక.. 2019 లో పొలం పనులకు వెళ్లిందంట. అప్పుడు అనుకొకుండా పామును తొక్కిందంట. అప్పుడు నల్ల పాము ఆమెను కాటేసింది. దీంతో వెంటనే ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రాణాలతో బైటపడింది.

4 /6

కానీ అప్పటి నుంచి పాము ఆమెపై పగ పెంచుకుందంట.  ఇప్పటి వరకు ఆమెను పాము.. 11 సార్లు కాటు వేసిందని తెలుస్తొంది. దీంతో వీరి కుటుంబం బిక్కు బిక్కు మంటు గడుతుపున్నారంట. దీంతో వారి గ్రామంలో అనేక గుడులు కూడా కట్టించారంట. కానీ పాము కోపం చల్లారలేదంట.

5 /6

పాము ఇటీవల యువతి ఆస్పత్రిలో చికిత్సలో ఉండగా.. అక్కడికి కూడా వచ్చి కాటు వేసిందని ఆమె తండ్రి చెబుతు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తొంది. మంత్రగాళ్లను కలిసి తాయత్తులు సైతం కట్టించారంట. అయిన పాము మాత్రం ఆమెను వదల్లేదంట.

6 /6

అయితే.. పాము కాటు వేసినప్పుడు ఆరోజు ఖచ్చితంగా శుక్రవారం ఉండటంను ఆ కుటుంబం గమనించారంట. దీంతో శుక్రవారం వచ్చిందంటే..ఆ కుటుంబం చాలా టెన్షన్ తో ఉంటారంట. దీంతో ఆ గ్రామస్థులు సైతం.. బాలిక జీవితం పట్ల తీవ్ర ఆందోళనగా ఉంటున్నారంట. ఈ ఘటన ఎంత నిజముందో కానీ.. ఈ వార్త మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.