Swetha Nagu Dream Signs In Upcoming Life: స్వప్న శాస్త్రానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఇది మనిషి నిద్రిస్తున్న సమయంలో పడే కలల గురించి క్లుప్తంగా వివరిస్తుంది. అంతేకాకుండా ఆ కలలో వెనుక ఉన్న అర్ధాన్ని కూడా సూచిస్తుంది. అలాగే ఈ కలల వల్ల భవిష్యత్తులో మంచి చెడులు జరుగుతాయా అనే అంశాలపై కూడా క్లుప్తంగా వివరించింది.
చాలామందికి కలలు వివిధ రకాలుగా పడుతూ ఉంటాయి. కొంతమంది అయితే ఉదయం 6 గంటల సమయంలో పడిన కలలు నిజమవుతాయని అంటూ ఉంటారు. ఇవి ఏ కలలైనా మంచైనా చెడు అయిన పక్కా జరుగుతాయని మన పూర్వీకులు తరచుగా చెబుతూ ఉంటారు. ఇది నిజమేనా? స్వప్న శాస్త్రం ఏం చెబుతుంది.
చాలామందికి వచ్చే కలలో ఎక్కువగా పాములు ఇతర జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొంతమందికి నల్లపాము కనిపిస్తే మరి కొంతమందికైతే తెలుపు రంగుతో కూడిన పాము (శ్వేత నాగు) కనిపిస్తూ ఉంటుంది. ఇలా పాములు కనిపించడం మంచిదేనా?
జ్యోతిష్య శాస్త్రంలో, స్వప్న శాస్త్రంలో పాముల కలలకు సంబంధించి వివిధ అర్థాలు ఉన్నాయి. కలలో పాము చేసే అంశాలపై ఆధారపడి ఉంటాయని స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు. పాము కలలో కాటేస్తే ఒక విధంగా అర్థం వస్తే.. పాము వెంబడించడానికి మరో అర్ధాన్ని స్వప్న శాస్త్రం చెబుతుందట.
కొంతమందికి కలలో తెల్లపాము (శ్వేత నాగు) కనిపిస్తూ ఉంటుంది. ఇలా తెల్లపాము కనిపించడం, అది వెంబడించడం, కాటేసేలా కనిపించడానికి అనేక అర్థాలు ఉన్నాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో తెల్లపాము కనిపించడం ఆశుభంగా పరిగణిస్తారు. అది మిమ్మల్ని వెంబడించేలా మీకు కనిపిస్తే అనేక సమస్యలు వస్తాయి.
స్వప్న శాస్త్రం ప్రకారం అదే నల్ల పాము కనిపిస్తే చాలా శుభప్రదమని.. జీవితంలో ఆనందంతో పాటు శ్రేయస్సు కూడా లభిస్తుందట. కాబట్టి కలలు తెల్లపాము కంటే నల్లపాము కనిపించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.