KCR in Assembly: అసెంబ్లీకి కేసీఆర్..! ఎమ్మెల్యేలతో కీలక మీటింగ్..

KCR in Assembly: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీవేడీగా జరగనున్నాయి. తెలంగాణలో అధికార మార్పిడి తర్వాత కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో బాత్రూమ్ లో జారీ పడి తుంటి ఎముక విరిగింది. ప్రస్తుతం కేసీఆర్ కోలుకొని తిరిగి మాములు స్థితిక వచ్చారు. అయితే.. అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీకి కేసీఆర్ వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 8, 2024, 08:42 AM IST
KCR in Assembly: అసెంబ్లీకి కేసీఆర్..! ఎమ్మెల్యేలతో కీలక మీటింగ్..

KCR in Assembly: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఈ రోజు  ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో కేసీఆర్ అధ్యక్షతన BRSLP భేటీ జరుగనుంది. అందులో తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ హాజరు కావాల్సిందిగా అల్టీమేటమ్ జారీ చేసారు. ఈ రోజు జరగనున్న భేటిలో ఎంత మంది ఎమ్మెల్యేలు హాజరు అవుతారనేది ఆసక్తి కరంగా మారింది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి 64 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. బీజేపికి 8, ఎంఐఎం పార్టీకి 7, సీసీఐ ఒక్క స్థానాల్లో విజయం సాధించింది.

గత యేడాది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ఆపరేషన్ ఆకర్ష్ కు తెర లేపారు. ఇప్పటికే 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అప్పట్లో చేసిన ఆపరేషన్ ఆకర్షన్ పనినే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మొదలు పెట్టారు. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఖాళీ చేద్దామనుకున్నా.. ఎవరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు. ఒకవేళ వెళ్లినా.. ఎలాంటి పదవులు వచ్చే అవకాశాలు లేవు. అందుకే కామ్ గా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలపై గొంతెత్తుతుంది. ఇప్పటికే హైడ్రా, మూసీ ప్రక్షాళన సహా పలు అంశాలపై ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలపై అందరి దృష్టి కేసీఆర్ పైనే ఉంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకీ వస్తారా లేదా అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక వేళ కేసీఆర్ అసెంబ్లీకీ వస్తే రాజకీయాలు ఎలా ఉంటాయో అని  పొలిటికల్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది. గతఅసెంబ్లీ సమావేశాలకు కూడా గులాబీ బాస్ హాజరుకాలేదు.  దీంతో తాజాగా కేసీఆర్ అసెంబ్లీకీ రావాలంటూ  సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకేళ కేసీఆర్ అసెంబ్లీకీ వస్తే అధికార ప్రతిపక్షాల మధ్య వార్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది.

ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..

 

ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News