Pushpa 2 Hindi Collections: బాలీవుడ్ లో మూడో రోజు ఆగని పుష్పరాజ్ బాక్స్ ఆఫీస్ దండయాత్ర.. ఇది ఎపిక్ రికార్డు..

Pushpa 2 Hindi Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ పై పుష్ప 2 దండయాత్ర కొనసాగుతోంది. అంతేకాదు తెలుగు వాళ్లతో పాటు హిందీ ప్రేక్షకులకు పుష్ప రాజ్ నటన తెగ నచ్చేసింది. అది వసూళ్ల రూపంలో కనిపిస్తోంది.

1 /9

Pushpa 2 Hindi Collections: ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. మన తెలుగు హీరోలు అదే పని చేస్తున్నారు. ఇంట గెలిచి బాలీవుడ్ లో రచ్చ చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్.. పుష్ప 1తో బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ ఊపుతూ పుష్ప 2 మూవీకి కొనసాగింపుగా పుష్ప 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

2 /9

ఈ సినిమా మన దేశంలో హిందీ వెర్షన్ లో తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సినిమా హిందీ బెల్ట్ లో పెద్ద మార్జిన్ లోనే తొలి రోజు వసూళ్లతో సెన్సేషనే క్రియేట్ చేస్తుందనే కంటే.. అరాచకమే చేసింది. అంతేకాదు అక్కడ తొలి రోజు వసూళ్లను చూసి బాలీవుడ్ ట్రేడ్ పండితులు ముక్కున వేలేసుకుంటున్నారు.

3 /9

మంచి యాక్షన్ చిత్రంతో పలకరిస్తే.. ఆదరించడానికి మేము రెడీ అంటున్నారు. అది బాహుబలి , కేజీఎఫ్ తాజాగా పుష్ప సినిమాలతో ప్రూవ్ అయింది. మొత్తంగా యాక్షన్ చిత్రాల కోసం ముఖం వాచిపోయిన బీ టౌన్ ప్రేక్షకులకు ఇపుడు దక్షిణాది యాక్షన్ చిత్రాలకు గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు.

4 /9

పుష్ప 2కు హిందీ బెల్ట్ ఏరియల్లో ఫస్ట్ డే   హిందీ వెర్షన్ మన దేశంలో నాన్ హాలీడే రోజున రూ.72 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది. రెండో రోజు రూ. 59 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ. 131 కోట్ల నెట్ వసూల్లతో దుమ్ము దులిపింది. మరోవైపు ఓవర్సీస్ లో $6 మిలియన్ వసూళ్లతో దుమ్ము లేపుతోంది.

5 /9

తాజాగా మూడో రోజు శని వారం ఈ సినిమాకు దాదాపు రూ. 50 కోట్ల నుంచి 55 కోట్ల మధ్య నెట్ వసూళ్లను రాబట్టడం గ్యారంటీ అంటున్నారు బుకింగ్స్ చూసినవాళ్లు. మొత్తంగా మూడో రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 580 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేయడం పక్కా అని చెబుతున్నారు. అంతేకాదు మూడో రోజుల్లోనే రూ. 500 కోట్ల మార్క్ అందుకోవడం విశేషం. మొత్తంగా టికెట్ రేట్స్ పెంపు అనేది బాగా కలిసొచ్చిన అంశమనే చెప్పాలి.  

6 /9

నాలుగో రోజు ఆదివారం పుష్ప 2 మరిన్ని వసూల్లు రాబట్టడం గ్యారంటీ అని చెబుతున్నారు. దాదాపు ఈ రోజు హిందీలో రూ. 60 కోట్ల వరకు నెట్ వసూళ్లు రాబట్టవచ్చని ఈ సినిమా బుకింగ్స్ చూస్తే తెలుస్తుంది. మొత్తంగా నాల్గో రోజు ఈ సినిమా రూ. 650 కోట్ల నుంచి రూ. 700 కోట్ల మార్క్ ను అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు.

7 /9

ఇప్పటి వరకు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర షారుఖ్ హీరోగా నటించిన ‘జవాన్’ మూవీ రూ. 65.50 కోట్ల నెట్ వసూల్లతో టాప్ లో ఉంది. ఇపుడు ఈ రికార్డును పుష్ప రాజ్ చరిత్ర తిరగరాసాడు.  

8 /9

బాలీవుడ్ లో పుష్ప 2 ది రూల్ చిత్రం ఫస్ట్ డే ఏకంగా రూ. 72 కోట్ల నెట్ వసూళ్లతో హిస్టరీ తిరగరాసాడు. మొత్తంగా ప్రభాస్.. బాహుబలితో పాటు కేజీఎఫ్ 2తో యశ్.. తాజాగా పుష్ప 2 ది రూల్ మూవీతో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ ను మన సౌత్ స్టార్స్ తిరగరాయడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా రూ. 294 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుుతున్నాయి.

9 /9

టాలీవుడ్ లో నాన్  రాజమౌళి హీరోగా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన ఏకైక తెలుగు హీరోగా కూడా బన్ని రికార్డు తిరగరాయడం విశేషం. మొత్తంగా అల్లు అర్జున్.. పుష్ప 2 ది రూల్ చిత్రంతో  ముందు ముందు హిందీలో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.