Padma Kasturirangan: కస్తూరి రంగన్ అమెజాన్ ప్రైమ్ కు సౌత్ ఇండియా కంటెంట్ హెడ్ గా నియమితులయ్యారు. కేవలం ఇంగ్లీష్ భాషకు సంబంధించిన కంటెంట్ మాత్రమే కాదు.. తెలుగు, తమిళం, కన్నడ సహా వివిధ ప్రాంతీయ భాషల్లో కంటెంట్ అందిస్తూ వరల్డ్ వైడ్ గా దూసుకుపోతుంది అమెజాన్ ప్రైమ్ వీడియో. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్షిణాది భారత్ ఒరిజినల్ కొత్త హెడ్ గా పద్మ కస్తూరి రంగన్ ను నియమించడం విశేషం. గత రెండేళ్లుగా పద్మ అమెజాన్ ప్రైమ్ లో కీ పొజినల్ లో ఉన్నారు. తాజాగా ఈమెకు ప్రమోషన్ కల్పిస్తూ దక్షిణ భారత దేశానికి హెడ్ గా ప్రమోషన్ ఇచ్చారు. ఆమె న్యూయార్క్ కు సంబంధిచిన విశ్వ విద్యాలయంలో ఫిల్మ్ కోర్సు పూర్తి చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జాయిన్ అయి కీ రోల్ పోషించారు.
ఆపై జీ మీడియో హౌస్ ఎంటర్టైన్మెంట్ లో హెడ్ గా పనిచేసారు. అటు తమడ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా సహా పలు కీలక సంస్థల్లో మంచి పొజిషియన్ లో పనిచేసిన ఆయా సంస్థలకు మంచి పేరు తీసుకొచ్చారు. అటు ప్రైమ్ వీడియో సంస్థలో చేరిన తర్వాత ఎన్నో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. అంతేకాదు ప్రైమ్ వీడియోలో పలు వెబ్ సిరీస్ లు.. షూస్ నిర్మిస్తూ ఆమె కంటూ సెపరేట్ ఐడెంటిటీ తెచ్చుకుంది. తాజాగా రానా హోస్ట్ గా నిర్వహిస్తున్న ‘ ది రానా దగ్గుబాటి షో’ ను ప్లాన్ చేసింది ఈమె ఆధ్వర్యంలో టీమే కావడం విశేషం.
ఈ సందర్భ్ంగా పద్మ కస్తూరి రంగన్ మాట్లాడుతూ.. ప్రైమ్ వీడియోలో సౌత్ ఇండియా ఒరిజినల్స్ హెడ్ గా బాధ్యతలు స్వీకరించడాన్ని సవాల్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. రెండేళ్ల క్రితం ప్రైమ్ వీడియోలో చేరిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు ఈ రెండేళ్లలో ప్రైమ్ వీడియోలో ఎన్నో అద్భుతమైన కంటెంట్ ను రూపకల్పన చేసినట్టు చెప్పుకొచ్చారు. ప్రైమ్ వీడియోలో తెలుగు కంటెంట్ కు ఆదరణ పొందడంలో తన టీమ్ తో చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాజాగా పెద్ద బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా సౌత్ భాషల్లో మంచి కంటెంట్ ను ప్రేక్షకుల అందించడమే తన లక్ష్యమన్నారు. ఈ అవకాశం కల్పించిన అమెజాన్ ప్రైమ్ వీడియో పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.