Pushpa 2 Day 1 WW Box Collections: ఇండియా బాక్సాఫీస్ పై పుష్ప 2 వైల్డ్ పైర్ ఊచకోత.. రికార్డుల రప రప..

Pushpa 2 Day 1 WW Box Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా సంచలనం రేపింది. అంతేకాదు ఈ గురువారం విడుదలైన ఈ సినిమా పెంచిన టికెట్ రేట్స్ తో భారతీయ బాక్సాఫీస్ దగ్గర సంచలన రికార్డు నమోదు చేసింది. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వైల్డ్ ఫైర్ ఊచకోత కోసింది.

1 /8

పుష్ప 2 ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్ అంటూ బన్ని  చేసిన హంగామాకు తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు.. హిందీ సహా అన్ని భాషల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అది బుకింగ్స్ రూపంలో కనిపించింది. పుష్ప 2 మూవీ థియేట్రికల్ గా తెలుగులోనే కాదు మన దేశంలోనే హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

2 /8

పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా రూ. 613 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 615 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ చిత్రం తొలి రోజు ఊహ కందని మాస్ ఊచకోత కోసింది.  మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్లకు పైగా షేర్.. రూ. 100 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

3 /8

మరోవైపు హిందీలో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. మొత్తంగా రూ. 72 కోట్ల నెట్ వసూళ్లతో పాటు రూ. 81.60 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది.  

4 /8

మరోవైపు ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా రూ. 32 కోట్ల షేర్ (రూ. 67.05 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొత్తంగా ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలిపితే $4 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది.

5 /8

పుష్ప 2 ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో ఈ సినిమా రూ. 25.0 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ).. రూ. 12.48 కోట్లు.. ఉత్తరాంధ్ర.. రూ. 7.70 కోట్లు..ఉమ్మడి తూర్పు గోదావరి .. 4.90 కోట్లు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి.. రూ. 4.45 కోట్లు.. ఉమ్మడి గుంటూరు.. రూ. 7.60 కోట్లు..  ఉమ్మడి కృష్ణా .. రూ. 5.20 కోట్లు..  ఉమ్మడి నెల్లూరు.. రూ. 2.28 కోట్లు.. మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ మొత్తం కలిపి రూ. 70.81 కోట్ల షేర్ (రూ.97.50 కోట్ల గ్రాస్ )కలెక్ట్ చేసింది.  

6 /8

మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 మూవీ రూ. 160.01 కోట్ల షేర్ (రూ. 285.55 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి భారతీయ సినీ పరిశ్రమలో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

7 /8

పుష్ప 2 సినిమా రూ. 617 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 620 బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ చిత్రం రూ. 459.99 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమాకు ప్రీమియర్స్ ఇతరత్రా కారణాల వల్ల మంచి వసూళ్లనే దక్కించుకుంది.

8 /8

రెండో రోజు శుక్రవారం కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. శని, ఆదివారాల్లో వచ్చే వసూళ్లను బట్టి ఈ సినిమా లాంగ్ రన్ ఈ పర్వతం లాంటి ఈ టార్గెట్ ను రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి.