Pushpa 2 1st day Hindi Box Office Collections: అంతా అనుకున్నట్టే జరిగింది. పుష్ప ది రైజ్ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ అయిన అల్లు అర్జున్.. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2 ది రూల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఈ సినిమా హిందీ బెల్ట్ లో పెద్ద సెన్సేషనే అనే కంటే.. అరాచకమే క్రియేట్ చేసింది.
Pushpa 2 1st day Box Office Collections: అవును బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ దూకుడు ముందు ఖాన్స్, కపూర్స్ , ప్రభాస్ వంటి హీరోలు కూడా వెనక్కి నెట్టబడ్డారు. అవును పుష్ప రాజ్ స్వాగ్ హిందీ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.
అవి కలెక్షన్స్ రూపంలో కనపడ్డాయి. అవును దేశ వ్యాప్తంగా పుష్ప 2 ది రూల్ మూవీ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, కన్నడ సహా ఆరు భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అంతేకాదు పుష్ప మూవీకి ఉన్న క్రేజ్ తో హిందీలో పుష్ప 2 మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
అంతేకాదు తొలి రోజు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హిందీ వెర్షన్ మన దేశంలో రూ. 72 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నాన్ హాలీడే రోజు ఫస్ట్ డే ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదంటున్న ట్రేడ్ పండితులు.
ఒక రకంగా ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో పుష్ప రాజ్ రికార్డులు తిరగరాసాడు. ఇప్పటి వరకు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర షారుఖ్ హీరోగా నటించిన ‘జవాన్’ మూవీ రూ. 65.50 కోట్ల నెట్ వసూల్లతో టాప్ లో ఉంది. ఇపుడు ఈ రికార్డును పుష్ప రాజ్ తిరగరాసాడు.
బాలీవుడ్ లో పుష్ప 2 ది రూల్ మూవీ మొదటి రోజు ఏకంగా రూ. 72 కోట్ల నెట్ వసూళ్లతో చరిత్రను తిరగరాసాడు. మొత్తంగా ప్రభాస్.. బాహుబలితో పాటు కేజీఎఫ్ 2తో యశ్.. తాజాగా పుష్ప 2 ది రూల్ మూవీతో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ ను మన సౌత్ స్టార్స్ తిరగరాయడం విశేషం.
తెలుగులో నాన్ రాజమౌళి హీరోగా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన ఏకైక తెలుగు హీరోగా కూడా అల్లు అర్జున్ రికార్డు తిరగరాయడం విశేషం. మొత్తంగా అల్లు అర్జున్.. పుష్ప 2 ది రూల్ మూవీతో ముందు ముందు బాలీవుడ్ లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.