చెన్నైకు చెందిన భారతీయ మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. షిఫాలీ రంగనాథన్(38)కు అమెరికాలోని సియాటెల్ నగరానికి డిప్యూటీ మేయర్ గా ఎన్నికైంది. 2014-15వ సంవత్సరం నుంచి షిఫాలీ రవాణా రంగంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తోంది. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ మేయర్ పదవి అలంకరించడంపై ఆమె, ఆమె కుటుంబ ఆనందం వ్యక్తం చేశారు. షిఫాలీ ప్రతిభ, నాయకత్వ లక్షణాలను గుర్తించే ఆమెను డిప్యూటీ పదవికి ఎంపిక చేసినట్లు సియాటెల్ మేయర్ జెన్నీ డేర్కన్ ఒక ప్రకటనలో తెలిపారు.
2001లో షిఫాలీ తండ్రి ప్రదీప్ రంగనాథన్ వృత్తిరీత్యా అమెరికా వెళ్లి కుటుంబంతో సహా అక్కడే స్థిరపడ్డారు. అంతకు ముందు చెన్నైలో నూగంబాక్కం లో ఉండేవారు. షామిలీ టెన్త్, ఇంటర్, బిఎస్సి చెన్నైలోనే చదివారు. అన్నా యూనివర్సిటీ నుంచి ఎన్విరాన్మెంట్ సైన్సులో గోల్డ్ మెడల్ సాధించారు.