Immunity Boost Drinks: ఇమ్యూనిటీని శరవేగంగా పెంచే 5 అద్భుతమైన హోమ్ మేడ్ డ్రింక్స్

సీజన్ మారగానే జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. రోజూ వారీ జీవితంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఇమ్యూనిటీ తగ్గడంలో ఈ సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఇమ్యూనిటీ బలోపేతం చేసేందుకు కొన్ని సహజసిద్ధమైన డ్రింక్స్ అద్భుతంగా పనిచేస్తాయి. 

Immunity Boost Drinks: సీజన్ మారగానే జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. రోజూ వారీ జీవితంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఇమ్యూనిటీ తగ్గడంలో ఈ సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఇమ్యూనిటీ బలోపేతం చేసేందుకు కొన్ని సహజసిద్ధమైన డ్రింక్స్ అద్భుతంగా పనిచేస్తాయి. 
 

1 /5

అల్లం తులసి టీ అల్లం తులసి ఆకులతో తయారు చేసిన టీ చలికాలంలో అద్భుతంగా పనిచేస్తుంది. అల్లంలో ఉండే యాంటీ వైరల్ గుణాలు జలుబు, దగ్గు నుంచి రిలీఫ్ ఇస్తాయి. తులసి ఇమ్యూనిటీని వేగంగా పెంచుతుంది. రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితాలుంటాయి

2 /5

పసుపు పాలు పసుపులో ఉండే కర్‌క్యూమిన్ అనే సహజసిద్ధమైన యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన పదార్ధం. వేడి పాలలో చిటికెడు పసుపు కలిగి కొద్దిగా తేనె మిక్స్ చేసి తాగితే జలుబు, దగ్గు సమస్యల్నించి ఉపశమనం లభిస్తుంది. గొంతు ఫ్రీ అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది

3 /5

నిమ్మ, తేనె నీరు వేడి నీటిలో నిమ్మరసం , తేనె కలిపి తాగడం వల్ల విటమిన్ సి లోపం ఉండదు. శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. రోజూ పరగడుపున తాగాల్సి ఉంటుంది

4 /5

క్యారట్-ఆరెంజ్ జ్యూస్ క్యారట్-ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా వివిధ రకాల సీజనల్ వ్యాధుల్నించి కాపాడుతాయి

5 /5

కాడా సీజన్ మారినప్పుడు ముఖ్యంగా చలికాలంలో కాడా అనేది బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పవచ్చు. ఇందులో దాల్చినచెక్క, లవంగం, నల్ల మిరియాలు, అల్లం, తులసి, తేనె కలుపుతారు. ఈ మిశ్రమం గొంతు గరగరను, జలుబు-దగ్గు సమస్యల్ని దూరం చేస్తుంది