Matka Movie Review: వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీ రివ్యూ.. ప్రేక్షకులకు పెద్ద జట్కా..

Matka Movie Review:  మెగా హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్.. ఈ మధ్యకాలంలో హీరోగా రేసులో వెనకబడ్డాడు. తాజాగా ఈయన కరుణ కుమార్ దర్శకత్వంలో  పీరియడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ‘మట్కా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ సక్సెస్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 14, 2024, 04:14 PM IST
Matka Movie Review: వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీ రివ్యూ.. ప్రేక్షకులకు పెద్ద జట్కా..

రివ్యూ: మట్కా (Matka)

నటీనటులు: వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, సత్యం రాజేష్, అజయ్ ఘోష్, రవి శంకర్, సలోని    తదితరులు

ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్

సినిమాటోగ్రఫీ: ఏ. కిషోర్

సంగీతం: జీవి ప్రకాష్

నిర్మాత : వైరా ఎంటర్టైన్మెంట్స్

దర్శకత్వం: కరుణ కుమార్  

విడుదల తేది: 14-11-2024

మెగా హీరో వరుణ్ తేజ్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’.  పలాసా 1978, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన తాజాగా ‘మట్కా’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ కు మంచి సక్సెస్ అందించాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..
స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో అప్పటి వైజాగ పట్టణంకి వాసు (వరుణ్ తేజ్) తన తల్లితో కలిసి వస్తాడు. అక్కడ అనుకోని సంఘటనలో అతడు బాల నేరస్తుల జైలుకు వెళతాడ. అక్కడికి వెళ్లిన తర్వాత అతని జీవితంలో ఎలాంటి మలుపులు తీసుకుంది. ఈ క్రమంలో అతనిలో లైఫ్ లో  ఇద్దరు వ్యక్తులు వస్తారు. ఈ క్రమంలో వాసు.. ‘మట్కా’ కింగ్ గా ఎలా ఎదిగాడు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలేమిటి అనేదే మిగిలిన స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమా 1960 టూ 80 బ్యాక్ డ్రాప్ మూవీగా కొన్ని నిజ జీవితల సంఘటనల ఆధారంగా తెరకెక్కించాడు. ఇప్పటి వరకు ఇలాంటి స్టోరీస్ ఎన్నో మనం తెలుగు సహా వివిధ భాషల్లో చూసిందే. ముఖ్యంగా ఈ సినిమా చూస్తుంటే.. అమితాబ్ ‘దీవార్’, కమల్ హాసన్ ‘నాయకుడు’ వంటి చిత్రాలు గుర్తుకు రాక మానవు. రీసెంట్ గా వచ్చిన కేజీఎఫ్, పుష్ప సినిమాలు ఇదే తరహా స్టోరీ అని చెప్పాలి.  మరీ ముఖ్యంగా ఓ వ్యక్తి చిన్నప్పటి నుంచి అతని చివర దశ వరకు ఉన్న పాత్రను వివిధ దశల్లో చూపించడం అంత ఈజీ విషయం కాదు. కానీ దర్శకుడు ఈ సినిమాను పరమ రొటీన్ గా తెరకెక్కించాడు. కొత్త కథలు ఎక్కడా ఉండవు. ఉన్న కథను ఎంత కొత్తగా చూపిండంపైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంది. సినిమాలో కొన్ని సీన్స్ చూస్తుంటే.. తర్వాత ఏం జరుగుతుందనేది ప్రేక్షకులు ఇట్టే గ్రహిస్తారు. పరమ రొటీన్ రొడ్డు కొట్టుడు మూవీ అని చెప్పాలి. మట్కా అనే జూదంతో దేశ వ్యాప్తంగా ఎలా హీరో ఎదిగాడనే పాయింట్ ను ఇంకాస్త ఇంట్రెస్ట్ గా చూపించి ఉంటే బాగుండేది. ఈ మట్కా అనే జూదం.. ముంబైలో కొంత మంది కూలీలు కాస్త రిలీఫ్ టైమ్ లో ఆడుకునే ఆటను ఎలా దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేసాడు. మొత్తంగా సినిమా మొత్తం హీరోను కొంచెం నెగిటివ్ షేడ్ లో చూపించినా.. క్లైమాక్స్ లో హీరోలో పరివర్తన అనేది కామన్ ఆడియన్స్ కోరుకుంటారు. అది ఇందులో కొరవడింది. మొత్తంగా దర్శకుడు ఓ మంచి కథను అద్భుతంగా తెరకెక్కించలేకపోయాడనే చెప్పాలి. సినిమా ఆర్ట్ వర్క్ తో పాటు పాత కాలంలో అప్పటి కాణీ, అర్ధణా లాంటివి సినిమాలో చూపించాడు. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే..
వరుణ్ తేజ్ మరోసారి తన అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. తన పాత్రలో విలనిజం చూపించడం ఇది రెండో సారి. గతంలో గద్దలకొండ గణేష్ మూవీ తర్వాత మరోసారి ఇందులో నెగిటిల్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించాడు. అంతేకాదు చిన్నప్పటి నుంచి పెద్ద వయసు వరకు ఓకే సినిమాలో డిఫరెంట్ గెటప్, మ్యానరిజంతో నటించే అవకాశం చాలా కొద్ది మంది మాత్రమే వస్తుంది. వివిధ ఏజ్ గ్రూపులో తన యాక్టింగ్ తో మెప్పించాడు.  మీనాక్షి చౌదరి తన పాత్రలో ఒదిగిపోయింది.  మరోవైపు అజయ్ ఘోష్, సత్యం రాజేష్ తమ నటనతో మెప్పించారు. విలన్ పాత్రలో నటించిన జాన్ విజయ్ ఇతర నటీనటులు తమ పరిధఇ మేరకు మెప్పించారు.

ప్లస్ పాయింట్స్

వరుణ్ తేజ్ నటన

ఆర్ట్ వర్క్

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

రొటీన్ కథ, కథనం

ఎమోషన్స్ పండక పోవడం

క్లైమాక్స్

పంచ్ లైన్.. మట్కా..  ప్రేక్షకులకు పెద్ద ‘జట్కా’.

రేటింగ్.. 2.25/5

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News