హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జనవరి 14తో ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా కొనసాగిస్తున్నారు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూనే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయాలని రాసిఉన్న గాలిపటం ఫొటోను ట్వీట్ చేశారు. కాగా, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రచార బాధ్యతలను తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు.
Combining #Sankranthi2020 with #MunicipalElections 😊 pic.twitter.com/jC0iB0jtAu
— KTR (@KTRTRS) January 15, 2020
నేడు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇంటి లోగిలి వద్ద రంగు రంగు ముగ్గులతో.. వాటి మధ్యన అందమైన గొబ్బెమ్మలతో.. మీ ఇంటి తలుపులు మామిడి తోరణాలతో.. మీ ఇంటి గుమ్మం పసుపు కుంకుమలతో.. ఆనంద నిలయంగా మారి.. మీ ఇంటిల్లి పాది, అందరూ నిత్యం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబసభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. మన కోసం నిత్యం శ్రమించే అన్నదాతలకు సెల్యూట్ అని, రైతుల త్యాగాలను కేటీఆర్ కొనియాడారు.
Also Read: ముగిసిన నామినేషన్ల పర్వం
ఇంటి లోగిలి వద్ద రంగు రంగు ముగ్గులతో..
వాటి మధ్యన అందమైన గొబ్బెమ్మలతో..
మీ ఇంటి తలుపులు మామిడి తోరణాలతో..
మీ ఇంటి గుమ్మం పసుపు కుంకుమలతో..
ఆనంద నిలయంగా మారి.. మీ ఇంటిల్లి పాది, అందరూ నిత్యం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబసభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 🙏 pic.twitter.com/gPVjMy0jgH
— KTR (@KTRTRS) January 15, 2020
కాగా, తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జనవరి 22వ తేదీన పోలింగ్ నిర్వహించనుండగా, 25న ఓట్ల లెక్కింపు ఉంటుంది. టీఆర్ఎస్ ప్రచార బాధ్యతలను కేటీఆర్ నిర్వర్తిస్తున్నారు.