మూవీ రివ్యూ: సముద్రుడు (Samudrudu)
నటీనటులు: రమాకాంత్, సుమన్, అవంతిక, భానుశ్రీ, సమ్మెట గాంధీ, దిల్ రమేష్, ప్రభావతి, మోనల్, సుమన్ శెట్టి, బిహెచ్ఇఎల్ ప్రసాద్, రాజ్ ప్రేమి, రామరాజు, శ్రవణ్, జబర్దస్త్ షేకింగ్ శేషు, చిత్రం శ్రీను, తేజ శెట్టి, జూనియర్ రాజశేఖర్, ఫైజా జాన్ తదితరులు
ఎడిటర్: నందమూరి హరి
సినిమాటోగ్రఫీ: వాసు
సంగీతం: సుభాష్ ఆనంద్
నిర్మాణం: కీర్తన ప్రొడక్షన్స్
సహ నిర్మాతలు: శ్రీ రామోజీ జ్ఞానేశ్వర్, సోములు నాయక్
నిర్మాత: బధావత్ కిషన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : నగేష్ నారదాసి
విడుదల తేది: 25/10/2024
కీర్తన ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం ‘సముద్రుడు’. నగేష్ నారదాసి డైరెక్షన్ చేసారు. సీనియర్ హీరో సుమన్, సమ్మెట గాంధీ, వంటి సీనియర్ నటులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.ఈ నెల 25వ తేదీన థియేట్రికల్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
సముద్ర తీరంలో నివసించే గ్రామ ప్రజల ప్రధాన జీవనాధారం చేపలు పట్టడమే. సముద్రంలో తుపాను, అలలు వస్తోన్న ప్రాణాలను సైతం లేక్క చేయకుండా ఎంతో కష్టపడి చేపల పడుతుంటారు. అయితే వారు పడ్డ కష్టాన్ని మధ్య దళారులు కొట్టేస్తుంటారు. దీంతో వాళ్లే సొంతంగా చేపలను అమ్మాలనే నిర్ణయం తీసుకుంటారు. అయితే.. ఈ మత్స్య కారులు, దళారుల మధ్య వార్ మొదలువుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు సుమన్ పోలీస్ ఆఫీసర్ గా వస్తాడు. అయితే ఆ ఊరిలో అందరు చదువు చెబుతూ వాళ్లలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో వారు ఉన్న సముద్ర తీరంలో ‘ట్యూన’ అనే చేప వస్తుంది. దాన్ని పట్టుకోవడానికి హీరోతో పాటు మత్స్య కారులు, ఇటు దళారులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుంటారు. ఈ క్రమంలో మత్స్య కారులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. చివరకు వాళ్లు సక్సెస్ అయ్యారా.. దళారులపై విజయం సాధించారా లేదా అనేదే ‘సముద్రుడు’ మూవీ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే :
దర్శకుడు ఈ సినిమాను ఎంతో స్డడీ చేసి తెరకెక్కించడాని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అంతేకాదు మత్స్య కారులు జీవితాలపై స్డడీ చేసినట్టు కనిపిస్తోంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో తడబడ్డట్టు కనపడింది. అంతేకాదు ఇలాంటి సినిమాలను సాంకేతిక విభాగం పనితీరు అద్భుతంగా ఉండాలి. సముద్రంలో సన్నివేశాలను సినిమాటోగ్రఫర్ పనితీరును మెచ్చుకోవాలి. అంతేకాదు ప్రేక్షకుల నుంచి మంచి నటన రాబట్టుకొన్నాడు. కథ బాగున్నా.. కథనం విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. హీరో, హీరోయిన్స్ తప్ప.. మిగిలిన నటీనటులు తెలిసిన వాళ్లు కావడంతో ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతారు. అక్కడక్కడ డప్పింగ్ కొంచెం సింక్ కానప్పటికీ ఓవరాల్ గా ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను మెప్పిస్తోంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా.. టెక్నికల్ పరంగా బాగానే ఖర్చు పెట్టారు. అది తెరపై కనబడింది.
నటీనటుల విషయానికొస్తే..
ఈ చిత్రంలో హీరోగా రమాకాంత్ మత్స్యకారుడు పాత్రలో ఒదిగిపోయాడు. నటనలో అక్కడక్కడ తడబడ్డ ఓవరాల్ గా మత్స్యకారుడు పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే ఆ ఊరికి వచ్చిన టీచర్ పాత్రలో నటించిన హీరోయిన్ తన పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా సుమన్ నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచారు. తన నటనతో మెప్పించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
ప్లస్ పాయింట్స్
సినిమాటోగ్రఫీ
హీరో సుమన్ స్క్రీన్ ప్రెజెన్స్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
డబ్బింగ్
అక్కడక్కడ లాజిక్ లేని సీన్స్
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter