sugar level: ఈ మధ్య కాలంలో చాలా మంది డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారు డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయానికి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉదయం అల్ఫహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ చేసే ముందు ఈ డ్రై ఫ్రూట్ తింటే ఫాస్టింగులో కూడా షుగర్ నార్మల్ అవుతుంది.
Diabetes: మీరు డయాబెటిస్ తో బాధపడుతున్నారా. అయితే మీరు డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్యాంక్రియాస్ తక్కువ చక్కెరను ఉత్పత్తి చేసినప్పుడు లేదా ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కానప్పుడు డయాబెటిస్ వస్తుంది. అప్పుడు రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి షుగర్ పేషంట్లు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
డయాబెటిస్ ఉన్నప్పుడు అతిగా తినకుండా మితంగా తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఏవీ తినాలన్నా తాగాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. అయితే ఈ డ్రై ఫ్రూట్ ను ను మధ్యాహ్న భోజనానికి ముందుకు తిన్నట్లయితే మీ షుగర్ ఫాస్టింగ్ లోనూ నార్మల్ గా ఉంటుంది.
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కు అరగంట ముందు ఈ డ్రై ఫ్రూట్ తినడం అస్సలు మర్చిపోవద్దు.
భోజనం చేసే అరగంట ముందు బాదంపప్పు తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా నార్మల్ గా ఉంటాయి.
బాదంలో మోనో-ఎన్ సంతృప్త కొవ్వు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను కంట్రోల్ చేయడంలో ఎంతగానో సహాయపడతాయి.
ఆహారం తిన్న తర్వాత బ్లడ్ షుగర్ అనేది పెరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేసేందుకు ఆహారం తినే అరగంట ముందు 20 గ్రాముల బాదం తినాలని వైద్యులు చెబుతున్నారు.
బాదంపప్పును అలాగే తినకూడదు.. నానబెట్టి పొట్టు తీసేయాలి. బాదంపప్పును ఎప్పుడూ వాటి పొట్టుతో తినకూడదు.
మాకు ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా మాత్రమే ఈ కథనం రాసాము. ఏదైనా ప్రయత్నం చేసే ముందు వైద్యులను సంప్రదించడం మరిచిపోవద్దు.