Dhanteras 2024 Lucky Zodiac Sign: ఈ సంవత్సరం ధన త్రయోదశి (Dhanteras) అక్టోబర్ 29 వచ్చింది. దీనిని భారతీయులు దీపావళికి ముందు జరుపుకుంటారు. ఈ పండగ రోజు ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజించడం ఆనవాయితిగావస్తోంది. దీపావళి పండగకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఈ పండగకి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది.
ధన త్రయోదశి (Dhanteras) పండగ రోజున చాలా మంది బంగారం కూడా విక్రయిస్తారు. దీంతో పాటు కుభేరుడిని కూడా పూజిస్తారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన పండగ రోజున కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఏర్పడతాయి. దీని కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి.
ధన త్రయోదశి రోజు నుంచి కొన్ని రాశులవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందే రాశులవారి వివరాలు తెలుసుకోండి.
మేష రాశివారికి ఈ ధన త్రయోదశి (Dhanteras) పండగ రోజు నుంచి కెరీర్ జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. అంతేకాకుండా వ్యాపారాలు కూడా చాలా బాగా సాగుతాయి. కుటుంబ జీవితంలో కూడా ఆనందం రెట్టింపు అవుతుంది. దీంతో పాటు సంపదన కూడా ఒక్కసారిగా పెరుగుతుంది.
మకర రాశివారికి కూడా అదృష్టం పెరుగుతుంది. దీని కారణంగా పనుల్లో కూడా సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా విపరీతమైన ఆదాయాన్ని పొందుతారు. అలాగే దీర్ఘకాలికంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా దూరమవుతాయి.
ఒంటరిగా ఉన్న మకర రాశివారికి వివాహ ప్రతిపాదనలు కూడా లభిస్తాయి. దీని కారణంగా కొన్ని లాభాలు పొందుతారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి కూడా ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు ఆనందం కూడా పెరుగుతుంది.
ధన త్రయోదశి (Dhanteras) రోజు నుంచి సింహ రాశివారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు కుటుంబంలో శాంతి కూడా పెరుగుతుంది. దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది. విద్యార్థులకు బోలెడు లాభాలు కలుగుతాయి.