Tea For White Hair Remedy: చాలామందికి ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వేధిస్తోంది. తెల్ల జుట్టు కనిపించడం వల్ల ముఖం అంద విహీనంగా మారిపోతుంది. దీనికి మార్కెట్లో దొరుకుతున్న అనేక రకాల ఉత్పత్తులను వినియోగిస్తారు. కానీ వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే నేచురల్ గా ఇంట్లో ఉండే వస్తువులతో కూడా తెల్ల జుట్టుకు శాశ్వతంగా నల్లగా మార్చుకోవచ్చు. టీ పొడిలో రెండు పదార్థాలు యాడ్ చేసి తీసుకో జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది.
టీ పొడి సాధారణంగా అందరి ఇళ్లలో ఉపయోగిస్తారు. ఇది అందుబాటులో ఉండే పదార్థమే దీని ఉపయోగించే జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీంతో తెల్ల జుట్టుకు సమస్యకు చెక్ పెట్టవచ్చు.
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో ఆరు స్పూన్ల టీ పొడిని వేసి నీరు పోసి కలపండి. ఆ తర్వాత చిక్కగా డి కాషన్ మాదిరి సగం అయ్యే వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఈ లిక్విడ్ చల్లబడిన తర్వాత అందులో మీరు కొబ్బరి నూనె వేసి కలపాలి. ఆ తర్వాత రెండు చుక్కల నిమ్మరసం కూడా వేయాలి వరకు బాగా పట్టించాలి. ఓ అరగంట వరకు అలాగే వదిలేయండి.
జుట్టు ఆరిన తర్వాత సాధారణ నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి కనీసం రెండుసార్లు చేసినా మీ జుట్టు నేచురల్ గా నల్లగా మారిపోతుంది తెల్ల జుట్టు సమస్యకు టీ పొడి శాశ్వతమైన పరిష్కారం.
ముఖ్యంగా టీ పొడిలో టానిక్ ఆసిడ్ ఉంటుంది. ఇది తెల్లబడిన జుట్టుకు ఎఫెక్టీవ్ రెమిడీగా పనిచేస్తుంది. మీ జుట్టు నల్లగా కనిపిస్తుంది.
ఎందుకంటే టీ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టులో డాండ్రఫ్ ,హెయిర్ ఫాల్ సమస్య కూడా చెక్ పెడుతుంది. అంతేకాదు స్ప్లిట్ అండ్ సమస్య ఎక్కువ కూడా ఎఫెక్టీవ్ రెమిడీ.
టీ పొడిని మన జుట్టుకు తరచుగా ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల నేచురల్ గా మీ చుట్టూ మెరిసిపోతుంది ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)