BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరే కొత్త ప్లాన్‌.. 6500 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్, ఓటీటీ బెనిఫిట్స్‌..

BSNL New Expensive Monthly Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రభుత్వ రంగ కంపెనీ. ఈ కంపెనీ ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ సేవలను అందిస్తుంది. బీఎస్ఎన్‌ఎల్‌ సరికొత్త ప్లాన్‌తో కస్టమర్లు అదనంగా ఓటీటీ బెనిఫిట్స్‌ కూడా పొందుతారు.ఇందులో నెట్‌ స్పీడ్‌తోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సేవలు కూడా పొందుతారు. ఈ సరికొత్త బీఎస్‌ఎన్‌ఎల్‌ రీఛార్జీ ప్లాన్‌ గురించి తెలుసకుందాం.
 

1 /5

BSNL New Expensive Monthly Plan: టెలికాం ధరలు పెరిగిన తర్వాత రీఛార్జీ ప్లాన్‌ ధరలను అన్ని టెలికాం కంపెనీలు భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఈ ధరలు పెనుభారంగా మారాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇందులో ఉచిత కాలింగ్‌ సదుపాయం, ఓటీటీ ఫ్రీగా పొందుతారు. ఈ ప్యాక్‌ వివరాలు తెలుసుకుందాం.  

2 /5

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.1,799 కాస్త ఖరీదైనప్పటికీ ఇందులోని బెనిఫిట్స్‌ చూస్తే కళ్లు చెదరాల్సిందే. ఎందుకంటే ఈ ప్యాక్‌ తో ఇతర ఓటీటీ లకు డబ్బులు అదనంగా పెట్టాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఈప్యాక్‌లో మీరు స్పీడ్‌ నెట్‌ కూడా అందుకుంటారు.   

3 /5

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్యాక్‌లో 300 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ నెట్‌ లభిస్తుంది. ఈ ప్యాక్‌ లో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ పొందుతారు. 6500 జీబీ డేటా ప్రతినెలా పొందుతారు. ఈ డేటా లిమిట్‌ దాటిన తర్వాత కూడా మీరు 20 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ నెట్‌ పొందుతారు.  

4 /5

ఈ రీఛార్జ్‌ ప్యాక్‌లో ఇతర ఓటీటీ సబ్‌స్క్రీప్షన్‌ ఉచితంగా పొందుతారు. ఇది బీఎస్‌ఎన్‌ఎన్‌ఎల్ అందిస్తో్న కాంప్లిమెంటరీ. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యుప్‌టీవీ ప్యాక్‌ ( సోనీలైవ్, జీ5), లయన్స్‌ గేట్‌ ప్లే, షెమరోమీ, ఎపిక్‌ఆన్‌ కూడా అదనంగా పొందుతారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న ఈ ఖరీదైన ప్యాక్‌లో మీరు ఎస్టీడీ, లొకల్‌ కాలింగ్‌ ఫ్రీ ల్యాండ్‌ లైన్‌ కనెక్షన్‌ కూడా పొందుతారు.   

5 /5

ఇటీవల జరిగిన బీఎస్‌ఎన్‌ఎల్‌ మీటింగ్‌లో మరో 6 నెలల్లో సర్వీసును మరింత మెరుగు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. లక్ష బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లను ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రభుత్వం రంగ కంపెనీ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 24 వేల టవర్లు అందుబాటులో ఉన్నాయి.