తెలంగాణలో ఆర్టీసి కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరింది. సమ్మె విరమించుకుని విధుల్లో చేరని కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తామని ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ.. ఇప్పటికీ ఇంకా విధుల్లోకి రాని ఉద్యోగుల సంఖ్య వేలల్లోనే ఉంది.
ఇదిలావుంటే, మరోవైపు టిఎస్ఆర్టీసిలో 6 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్టు టిఎస్ఆర్టీసి చేసిన ప్రకటనతో.. ఉద్యోగాల కోసం భారీ సంఖ్యలో నిరుద్యోగులు డిపోల ఎదుట క్యూ కట్టారు. తాత్కాలిక పద్ధతిలో నియమించుకున్న డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో అధికారులు బస్సులను నడుపుతున్నారు.
3వ రోజుకు చేరిన ఆర్టీసి సమ్మె