"పద్మావతి" చిత్రం ఓ కుట్ర

  

Last Updated : Nov 11, 2017, 12:47 PM IST
"పద్మావతి" చిత్రం ఓ కుట్ర

ప్రముఖ హిందీ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన "పద్మావతి" సినిమా మరిన్ని వివాదాలకు తావిస్తోంది. ఇటీవలే ఇదే సినిమాపై బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి తన అభిప్రాయాలను పంచుకున్నారు, హిందూ చారిత్రక విషయాలపై  ప్రపంచ స్థాయిలో ఒక కుట్ర అనేది జరుగుతుందని ఆయన ఆరోపణలు చేశారు. "పద్మావతి" చిత్రం కూడా అలాంటి కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. ముస్లిం పాలకులను గొప్ప వీరులుగా చూపిస్తూ.. చరిత్ర వక్రీకరణకు పాల్పడుతున్నారని సుబ్రమణ్యస్వామి తెలిపారు. అమీర్ ఖాన్ చిత్రం "పీకే" కూడా అందుకు అతీతం కాదని.. ఆ చిత్రాన్ని పాకిస్తాన్‌ను ప్రోత్సహించేలా తీశారని ఆయన అభిప్రాయపడ్డారు. డిసెంబరు నెలలో విడుదల కానున్న పద్మావతి చిత్రంపై  ఇప్పటికి అనేక వివాదాలు తెరమీదికొచ్చాయి. రాజపుత్ర సంఘాల నుండి తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. అదేవిధంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. అయితే కోర్టు ఆ పిల్‌ను కొట్టివేసింది. చిత్రాలకు సంబంధించిన వివాదాలు, అభ్యంతరాలు ఉంటే.. అందుకు తగ్గ సమాధానం సెన్సార్ బోర్డు మాత్రమే ఇస్తుందని కోర్టు తెలియజేసింది

Trending News