Tirumala Tirupati Devasthanam: ఈ సెలవుల్లో తిరుపతి వంటి పవిత్రమైన పుణ్య క్షేత్రాలకు వెళ్లాలని చాలామంది కోరుకుంటారు. ప్లాన్ చేసి వెళ్తారు. మీరు కూడా తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? అయితే, మీకు ఇది బిగ్ అలెర్ట్.. ఈ విషయం ముందుగానే తెలుసుకోండి..
తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకోవడానికి ఎంతో మంది ఆరాటపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో దసరా సెలవులు వచ్చాయని మీరు కూడా తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? అయితే, మీకు ఇది బిగ్ అలెర్ట్..
స్కూళ్లకు సెలవులు వచ్చేశాయి. అధికారికంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రకటన చేశాయి. అయితే, ఈ సెలవుల్లో తిరుపతి వంటి పవిత్రమైన పుణ్య క్షేత్రాలకు వెళ్లాలని చాలామంది కోరుకుంటారు. ప్లాన్ చేసి వెళ్తారు. మీరు కూడా తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? అయితే, ఈ విషయం ముందుగానే తెలుసుకోండి.
తిరుమలలో తిరుమంజాసనం వంటివి నిర్వహించారు. మొన్నటి వరకు అంగప్రదక్షిణ, లక్కీ డిప్ ద్వారా తిరుమల దర్శనం టిక్కెట్లను విడుదల చేశారు.
లక్కీడిప్ ల ద్వారా టిక్కెట్లు పొందే వారు ఆధార్ కార్డు ద్వారా అంగప్రదక్షిణ టిక్కెట్‌ను పొందుతారు. ఇదిలా ఉండగా అంతకు ముందు 24 వ తేదీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లు డిసెంబర్‌కు సంబంధించినవి కూడా టీటీడీ విడుదల చేసింది.
అయితే, ఇదిలా ఉండగా ఈ నెల అక్టోబర్ 3 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పది రోజులపాటు ప్రత్యేక దర్శనం దేవస్థానం రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈనెల 3 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు నిలిపి వేయనున్నారు.
ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, ఏడాదిలోపు పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు అక్టోబర్ 3 నుంచి 12 వరకు రద్దు చేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది.
ఇక తిరుమల శ్రీ వేంకటేశుని బ్రహ్మోత్సవాల సందర్భంగా కొన్ని వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోడానికి వస్తారు. ఈ నేపథ్యంలో బ్రేక్ దర్శనాలు, పలు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది టీటీడీ.