Curry Leaves For White Hair: కరివేపాకు మన వంట గదిలో ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇది కూరకు మంచి సువాసనను అందిస్తుంది. అంతేకాదు కరివేపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మన హెయిర్ కేర్ రొటీన్ లో కరివేపాకులను చేర్చుకోవడం వల్ల కూడా అనేక పోషకాలు అందడంతో పాటు తెల్ల జుట్టు కూడా చెక్ పెడుతుంది. జుట్టు ఆరోగ్యంగా బలంగా పెరగడానికి కరివేపాకును ఉపయోగించాలి. ఇందులో యాంటీ మైక్రోబ్రియల్, యాంటీ బ్యాక్టిరియల్ మెడిసినల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తాయి, జుట్టు తెల్లబడటానికి నివారిస్తాయి. అంతేకాదు డాండ్రఫ్ రాకుండా కూడా కాపాడుతుంది. దీంతో హెయిర్ ఫాల్ సమస్య కూడా చెక్ పెట్టవచ్చు అయితే కరివేపాకుతో నూనెను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కొబ్బరి నూనె..
కొబ్బరి నూనెలో కరివేపాకు కరివేపాకు వేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల వైట్ హెయిర్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ముందుగా రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె తీసుకొని ఆ ఒక పాన్ లో వేసి అది వేడి చేసుకోవాలి ఆ తర్వాత 12 కరివేపాకు ఆకులను కూడా వేసి మరో 20 నిమిషాల పాటు మీడియం మంట మీద వేయించుకోవాలి. కొబ్బరి నూనెను చల్లార్చుకున్న తర్వాత వడకట్టుకోవాలి షాంపు చేసుకునే ముందు ఈ నూనెను జుట్టుకు అప్లై చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ హెయిర్ మాస్క్ ను వారానికి రెండు సార్లు ప్రయత్నిస్తే వైట్ హెయిర్ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.
పెరుగు..
ఒక బౌల్ తీసుకొని అందులో 1/4 కప్పు కరివేపాకు ఆకులు, అరకప్పు పెరుగు వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్టును చుట్టూ కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి అరగంట ఆరనివ్వాలి. దీంతో ఈ ఆ తర్వాత తలస్నానం చేసుకోవాలి ఈ మాస్క్ ను వారానికి మూడుసార్లు అప్లై చేస్తే వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది.
ఇదీ చదవండి: ఈ నూనె పెట్టండి జుట్టు నడుం వరకు మందంగా పెరుగుతుంది..
కరివేపాకు నీరు..
కరివేపాకుతో జుట్టుకు నీరు తయారు చేసుకొని అప్లై చేయడం వల్ల కూడా ఎఫెక్టివ్ రెమిడీగా పనిచేస్తుంది. 20 కరివేపాకుల ఆకులు తీసుకొని రెండు కప్పుల నీరు పోసి బాగా మరిగించుకోవాలి. చల్లారిన తర్వాత ఈ నీటిని ఒక స్ప్రే బాటిల్ లో వేసుకోవాలి షాంపూ చేసుకునే ముందు జుట్టు అంతా స్ప్రే చేసుకుని ఆరనివ్వాలి తర్వాత తల స్నానం చేసుకోవాలి.
కరివేపాకును మన అమ్మమ్మల కాలం నాటి నుంచి ఉపయోగిస్తున్నారు కరివేపాకుల అనేక పోషకాలు ఉంటాయి. కాబట్టి వైట్ హెయిర్ సమస్యకు చెక్ పెట్టడమే కాదు జుట్టు నల్లగా మందంగా పొడుగ్గా పెరుగుతుంది. ఎందుకంటే కరివేపాకులో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది హెయిర్ ఫాలికల్స్ ని డామేజ్ కాకుండా నివారిస్తుంది. ఇందులో బీటా కెరొటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. కరివేపాకు హెయిర్ ఫాల్ సమస్యలకు ఎఫెక్టీవ్ రెమిడీ.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
ఇదీ చదవండి: భారీ వర్షాలు రెడ్ అలెర్ట్.. అన్నీ స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.