Pawan kalyan vs prakash raj: సనాతన ధర్మం జోలికి రావోద్దు.. ఇంద్రకీలాద్రి సాక్షిగా మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. వీడియో..

Tirumala laddu controversy: తిరుమల లడ్డు వివాదంపై పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకుని శుధ్ది కార్యక్రమంలో చేపట్టారు. దీనిలో భాగంగా ఆయన ఇంద్ర కీలాద్రిలో మెట్లను శుభ్రం చేశారు.  అంతేకాకుండా.. వైఎస్సార్సీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Sep 24, 2024, 11:15 AM IST
  • ఇంద్ర కీలాద్రిలో పవన్ శుద్దిపూజలు..
  • ప్రకాశ్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేనాని..
Pawan kalyan vs prakash raj: సనాతన ధర్మం జోలికి రావోద్దు.. ఇంద్రకీలాద్రి సాక్షిగా మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. వీడియో..

Pawan kalyan hot comments on ysrcp leaders on tirupati laddu row: తిరుమల లడ్డు వివాదం ఏపీని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవల తిరుమలలో ప్రాయిశ్చిత్త యాగం కూడా నిర్వహించారు. అయితే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్.. 11 రోజులు పాటు ప్రత్యేకంగా ప్రాయిశ్చిత  దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ రోజు.. విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. అక్కడ మెట్లను పసుపు నీళ్లతో శుభ్రం చేశారు. అంతేకాకుండా.. మెట్లకు పసుసు, కుంకుమ బోట్లు సైతం పెట్టారు. ఆతర్వాత ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు.

 

ఇదిలా ఇటీవల లడ్డు వివాదం తెరమీదకు వచ్చిన తర్వాత వైసీపీ నేతలు సైతం .. దీనిపైన  గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు డైవర్ట్ పాలిటిక్స్ లకు పాల్పడుతున్నారంటూ కూడా మండిపడ్డారు. అంతేకాకుండా.. ఏకంగా ప్రధాని మోదీకి సైతం లడ్డు వివాదంపై లేఖను రాశారు. మరోవైపు వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ లు వేశారు.

 

మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణం చేస్తు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తప్పుచేయలేదని కూడా.. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ప్రమాణం చేశారు. ఇక విజయవాడ ఇంద్ర కీలాద్రిని దర్శనం చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

పూర్తి వివరాలు..

తిరుమల లడ్డు వివాదంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి సాక్షిగా ఆయన హిందు ధర్మం జోలికి ఎవరు రావొద్దని ఫైర్ అయ్యారు. హిందూ ధర్మ పరిరక్షణ బాధ్యత అందరిదని అన్నారు. ఇతరు మతాల్లో ఏదైన జరిగితే నోరు మెదపరా అన్ని ప్రశ్నించారు. మసీదుల్లో, చర్చిలలో ఇలాగే జరిగితే చూస్తు ఊరుకుంటారా..అంటూ కూడా ఫైర్ అయ్యారు.

హిందుువుల మనోభావాలు ఉండవా.. హిందువులపై దాడులు  జరిగుతుంటే, ఆలయాలలో అపవిత్రమైన పనులు జరుగుతుంటే చూస్తు ఊరుకోవాలా.. అంటూ మండిపడ్డారు. ఇక మీదట ఇలాంటివి సహించేదిలేనది విజయవాడ నుంచి పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కొంత మంది తప్పులు చేసిన కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

వైసీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు ఇప్పటికీ సహిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ సనాతన ధర్మంపై అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం చూస్తు ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తిరుమలను ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా మార్చారని  మండిపడ్డారు. తిరుమల అపవిత్రతకు మాజీ ఈఓ ధర్మారెడ్డే ప్రధాన కారణమన్నారు. ఇంత ఘోరం జరుగుతున్నా ఆయన ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. 

అదే విధంగా.. దేశంలోని హిందువులకు సాటి మతాలపై ద్వేషం ఉండదని పవన్ కళ్యాణ్ అన్నారు. లడ్డు వివాదంపై ప్రకాశ్ రాజ్ కూడా మండిపడ్డారు. ఆయనకు దీనిలో ఏం సంబంధం ఉందని కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆయనంటే.. తనకు గౌరవముందని, కానీ లడ్డు విషయంలో అపహాస్యం చేసేలా మాట్లాడితే మాత్రం సహించేది లేదన్నారు. అదేవిధంగా..

Read more: Pawan kalyan: విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రాయిశ్చిత్త కార్యక్రమం.. వీడియో ఇదే..

మాజీ AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి  మదమెక్కి మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. శ్రీవారి ప్రసాదంకు ఉపయోగించే నెయ్యి కన్నా.. పందికొవ్వు కాస్లీ అని మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఎంతధైర్యమని పవన్ కళ్యాణ్ తీవ్ర అసహానం వ్యక్తం చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News