Watermelon Seeds Laddu: పుచ్చకాయ ఆరోగ్యనికి ఉపయోగపడే అద్భుతమైన పండు. ఇందులో వాటర్ కంటెట్ అధికంగా ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అయితే సాధారణంగా మనం పుచ్చకాయ తినే ముందు గింజలను పక్కనపడేస్తాము. కానీ ఈ గింజల్లో కూడా బోలెడు లాభాలు ఉంటాయి.
పుచ్చకాయ గింజలతో అద్భుతమైన లడ్డులను తయారు చేసుకోవచ్చు. దీని తయారు చేయడం ఎంతో సులభం కూడా. దీని తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
పుచ్చకాయ గింజల లడ్డులు చాలా రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఇవి ప్రోటీన్, జింక్ లాంటి పోషకాలతో నిండి ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. దీని తినడం వల్ల అధిక రక్తపోటు, బరువు నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా పుచ్చకాయ గింజల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. పుచ్చకాయ గింజల్లో విటమిన్ E అధికంగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముడతలు, మచ్చలు ఏర్పడకుండా చేస్తుంది.
పుచ్చకాయ గింజల లడ్డు తయారీ విధానం:
కావలసిన పదార్థాలు:
పుచ్చకాయ గింజలు - 1 కప్పు
బెల్లం - 1 కప్పు
జీడిపప్పు - ¼ కప్పు
బాదం పొడి - ¼ కప్పు
ఎండు ద్రాక్ష - ¼ కప్పు
గుమ్మడికాయ గింజలు - ¼ కప్పు (ఐచ్ఛికం)
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
ఒక నాన్-స్టిక్ పాన్‌లో పుచ్చకాయ గింజలను వేసి, తక్కువ మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వేయించిన గింజలను చల్లబరచండి. ఒక స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలో బెల్లం వేసి, కొద్దిగా నీరు పోసి మంట మీద ఉంచండి. ఆ తరువాత బెల్లం కరిగి, పాకం కాస్త చిక్కబడిన తర్వాత దింపి, చల్లబరచండి.
ఇప్పుడు జీడిపప్పు, బాదం పొడి, ఎండు ద్రాక్ష, గుమ్మడికాయ గింజలను ఒక పాన్‌లో వేసి, తక్కువ మంట మీద కాల్చి, చల్లబరచాలి. వేయించిన పుచ్చకాయ గింజలు, చల్లబరచిన బెల్లం పాకం, డ్రై ఫ్రూట్స్‌లను ఒక పాత్రలో కలిపి, బాగా మిశ్రమం చేయండి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, లడ్డులను తయారు చేసుకోండి.
తయారు చేసిన లడ్డులను నెయ్యి రాసుకోవడం వల్ల మరింత రుచిగా ఉంటాయి.
గమనిక:
పుచ్చకాయ గింజలను బాగా శుభ్రం చేసి, ఎండబెట్టి ఉపయోగించాలి.
Also Read: Kandagadda Fry: కందగడ్డ ఫ్రై ప్రయోజనాలు తెలుస్తే అసలు వదిలిపెట్టరు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.