Nuvvula Laddu Secret In Telugu: నువ్వుల లడ్డులు అంటే అందరూ ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా పొట్టను ఆరోగ్యంగా చేసే ప్రత్యేకమైన మూలకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్స్ అధిక పరిమాణాల్లో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తాగడం వల్ల శరీరంలోని కణాలు దృఢంగా తయారవుతాయి. అంతేకాకుండా ఇందులో ఆరోగ్యమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇవే కాకుండా ఇందులో కార్బోహైడ్రేట్లు, విటమిన్ Eతో పాటు కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. ఇవి శరీరానికి అద్భుతమైన శక్తిని అందించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈ లడ్డులను తినడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నువ్వుల లడ్డు లాభాలు:
శక్తిని పెంచుతుంది:
నువ్వుల్లో కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా శరీర అభివృద్ది కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
గుండె సమస్యలకు చెక్:
నువ్వుల్లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రోజు వీటితో తయారు చేసిన లడ్డు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిపోయి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంతేకాకుండా గుండె సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
రక్తహీనత సమస్యలకు:
నువ్వుల లడ్డుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తాన్ని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్తాన్ని మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఎముకలను దృఢత్వం:
నువ్వుల లడ్డుల్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది:
నువ్వుల్లో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది ముఖంపై ముడతలను తొలగించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది:
నువ్వు లడ్డులు ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి తగిన ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.