Bigg Boss 8 Telugu: కాబోయే భార్య తో హౌస్ లోకి రాబోతున్న చైతూ..!

Naga Chaitanya and Sobhita Dhulipala: నిశ్చితార్థం తర్వాత తొలిసారి నాగచైతన్య,  శోభిత ధూళిపాల బిగ్ బాస్ హౌస్ లోకి అతిథిగా రాబోతున్నట్లు సమాచారం.  నాగర్జున హోస్టుగా చేస్తున్న ఈ కార్యక్రమానికి ఈ జంట ప్రత్యేక అతిధులుగా రాబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 4, 2024, 04:37 PM IST
Bigg Boss 8 Telugu: కాబోయే భార్య తో హౌస్ లోకి రాబోతున్న చైతూ..!

Naga Chaitanya and Sobhita: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 ఎట్టకేలకు సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభం అయింది.  ఇప్పటికే రెండు రోజులు పూర్తి అయిన ఈ షో అందరిని ఆకట్టుకుంటుంది.  ముఖ్యంగా ఎవరికి వారు తమ పర్ఫామెన్స్ చూపిస్తూ ప్రేక్షకులలో మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నూతన కాబోయే దంపతులు శోభితా ధూళిపాల,  నాగచైతన్య మొదటిసారి కలసి కనిపించబోతున్నారని సమాచారం. దాదాపు రెండు సంవత్సరాల పాటు రహస్యంగా ప్రేమించుకున్న శోభిత,  నాగచైతన్య ఎట్టకేలకు ఈ ఏడాది తమ ప్రేమ వివాహాన్ని ప్రకటించి,  ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. 

ఇక నిశ్చితార్థం తర్వాత వీరు ఎక్కడ బహిరంగంగా జంటగా కనిపించలేదు. కానీ మొదటిసారి వీరిద్దరూ కలిసి బిగ్ బాస్ హౌస్ లో ఉండే హౌస్ మేట్స్ ని అలరించడానికి అతిథిగా రాబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ జంట కోసం నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారని , ముఖ్యంగా వీరిని కలిపి ఒకేసారి తెరపైకి తీసుకొస్తే టీఆర్పి రేటింగ్ మరింత పెరుగుతుందననే ఆలోచన చేస్తున్నారట. అందులో భాగంగానే నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ షో కి నాగచైతన్య,  శోభితను జంటగా ఆహ్వానించినట్లు సమాచారం. 

ఇకపోతే నాగ చైతన్య, శోభిత ధూళిపాల నిశ్చితార్థానికి సంబంధించి పూర్తి వివరాలను నాగార్జున వెల్లడించారు. వీరిద్దరి నిశ్చితార్థం పూర్తయిన తర్వాత ఆయన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా ఫోటోలు షేర్ చేస్తూ ఈరోజు నాగచైతన్యని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.

సమంత నుంచి విడిపోయిన తర్వాత ఆ బాధను ఒక్కడే అనుభవించాడు. ఆ తర్వాత చైతన్య ముఖంలో ఒక్కరోజు కూడా నేను ఆనందాన్ని చూడలేదు. కానీ నేడు శోభితాతో నిశ్చితార్థం తర్వాత మళ్లీ నాగచైతన్య ముఖంలో ఆ సంతోషం చూడడం నా మనసుకు చాలా హాయిగా అనిపించింది అంటూ నాగార్జున ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇక ఇప్పుడు ఈ జంట ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్ లో కనిపించబోతున్నారు.  మరి ఈ ఎపిసోడ్ ఎలాంటి టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Also Read:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

Also Read:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News