Telangana Employees: తెలంగాణతో పాటు ఏపీలో కురుస్తోన్న భారీ వర్షాలకు జన జీవితం అస్తవస్తమయింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మున్నేరు డ్యామ్ గండి పడటంతో ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఏర్పడిన వరదల నేపథ్యంలో సినీ ప్రముఖులు, సామాన్యులు, ఉద్యోగులు తమ వంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వరదల నేపథ్యంలో తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లకు చెరో రూ. 50 లక్షల చొప్పున .. రూ. కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. మరోవైపు తెలంగాణ ఉద్యోగులు ఒక రోజు బేసిక్ పేను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ. ఇందులో ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు , కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింబగ్ ఉద్యోగులు ఒక రోజు తమ పేసిక్ పే నుంచి సెప్టెంబర్ నెల జీతం నుంచి ప్రభుత్వ ఖజానకు జమ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసారు. ఈ విరాళం మొత్తం రూ. 100 కోట్లకు పైగానే ఉంటుందని ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగుల తరుపున సమిష్టి నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఖమ్మంతో పాటు పలు ఏరియాల్లో సర్వం కోల్పొయిన బాధితులు.. తీవ్ర ఇక్కట్టు ఎదుర్కొంటున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వరద బాధితులకు సాయం కోసం కోసం ఉద్యోగ సంఘాలు ముందుకొచ్చాయి. అందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగుల తరుపున ఒక రోజు వేతనం బాధితులకు ప్రకటించారు.
ముఖ్యంగా హైదరాబాద్ లో భారీ వర్షాలు కారణంగా పెద్దగా వరద ముప్పు ఏర్పడలేదు. కానీ ఖమ్మంతో జిల్లాలో పాటు మొిగిలిన జిల్లాల్లో కుంటలు, చెరువుల కట్ట తెగడంతో ఆ సమీపంలోని కాలనీలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. ఇవాళ , రేపు తెలంగాణలోని సగానికి పైగా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు మిగిలిన తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్సాలకు తలాకుతలమైంది. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. మరోవైపు బాధితులకు భరోసా ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.