Heavy rains in Hyderabad: హైదరాబాద్ నగరం వర్షాలకు చిగురుటాకులా వణికిపోయిందని చెప్పుకొవచ్చు. రోడ్లన్ని జలమయమైపోయాయి. ఇళ్లలోని నీళ్లు వచ్చిచేరుతున్నాయి.
వరుణుడు రెండు తెలుగు రాష్ట్రాలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఎడతెరిపిలేకుండా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు నిండుకుండలను తలపిస్తున్నాయి. రోడ్లన్నిజలమయమైపోయాయి.
హైదరాబాద్ లో ప్రధాన ఏరియాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుందని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా ఇప్పటికే భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లో పాఠశాలలకు బంద్ సైతం ప్రకటించారు.
అత్యవసరమైతే తప్ప బైటకు రావొద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ కాట హైదరబాద్ లో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు.
వరదల వల్ల ప్రభావితమైన పలు కాలనీలను ఆమ్రాపాలీ కాట పరిశీలించారు. ఖైరతాబాద్ తో పాటు పలు ఏరియాలో ఆమ్రపాలీ సుడిగాలి పర్యటన చేపట్టారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తమకు అప్ డేట్ ఇవ్వాలని కోరారు.
అత్యవసరమైనే ప్రజల బైటకు రావాలని కోరారు. అంతేకాకుండా.. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు సెలవులు పెట్టొద్దని కూడా ఆదేశించారు. మ్యాన్ హోల్స్ లు తెరవొద్దని,విద్యుత్ స్తంభాలు, కరెంట్ వయర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా తెలిపారు.
వర్షాల నేపథ్యంలో.. అత్యవసరంగా సహాయంకావాల్సిన వారు.. గ్రేటర్ హైదరబాద్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేయాలని కూడా కోరారు. ముఖ్యంగా.. 04021111111 అదే విధంగా.. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 9000113667 లకు సమాచారం ఇవ్వాలని కోరారు.