మూవీ: సీతారాం సిత్రాలు
నటీనటులు : లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక తూటిక, కిషోరి ధాత్రక్, ఆకెళ్ళ రాఘవేంద్ర, సందీప్ వారణాసి, ఢిల్లీ రాజేశ్వరి, కృష్ణమూర్తి వంజారి
కెమెరామెన్: అరుణ్ కుమార్ పర్వతనేని
మ్యూజిక్: రుద్ర కిరణ్
బ్యానర్: రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: పార్థ సారధి, డి. నాగేందర్ రెడ్డి, కృష్ణ చంద్ర విజయ బట్టు
రచన, దర్శకత్వం: డి.నాగ శశిధర్ రెడ్డి
చిన్న సినిమాలు ప్రస్తుతం మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ రూట్లో ఆకట్టుకునే కథ, కథనంతో తెరకెక్కుతోన్న సినిమాలకు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘సీతారాం సిత్రాలు’. కొత్తవాళ్లతో చేసిన ఈ మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకుందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
కర్నూలు పట్టణం సమీపంలో ఒక చిన్న టీ కొట్టు నడుపుకుంటూ ఉంటాడు శివ(లక్ష్మణమూర్తి). శివ టీ స్టాల్ లో టీ తాగితే ఎలాంటి తలనొప్పి మటు మాయం కావాల్సిందే. అంతేకాదు ఇతరులు చెప్పే మంచి మాటలను వాట్సప్‌లో స్టేటస్‌గా పెడుతూ అందరితో ‘స్టేటస్ శివ’ అని పిలిపించుకుంటూ ఉంటాడు. లైప్ లో మంచి స్టేటస్ తో సెటిల్ కావాలనుకునే టైపు. ఈ గ్యాప్‌లో టీచర్‌గా పని చేసే పార్వతి( భ్రమరాంబిక)తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవడానికి అప్పు చేసి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. అనుకోకుండా పెళ్లి ఆగిపోతుంది. ఈ క్రమంలో చేసిన అప్పు తీర్చలేక సతమతమవుతాడు. ఈ క్రమంలో అతని జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఈ క్రమంలో అతని జీవితంలో ఎలాంటి మలుపు తీసుకుంది. ఈ క్రమంలో అతను జీవితంలో సెటిలై భ్రమరాంబను పెళ్లి చేసుకున్నాడా.. ! లేదా అనేది ‘సీతారామ సిత్రాలు’.
కథనం, విశ్లేషణ:
ప్రస్తుతం తెలుగులు రొమాన్స్,యాక్షన్, వయలెన్స్ చిత్రాలే రాజ్యం ఏలుతున్నాయి. ఈ క్రమంలో ఫ్యామిలీ మొత్తంతో కలిసి చూసే సినిమాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ క్రమంలో నాగ శశిధర్ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేలా ‘సీతారాం సిత్రాలు’ సినిమాను తెరకెక్కించారు. తాజాగా దర్శకుడు ఎంచుకున్న సబ్జెక్ట్.. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. ప్రతి మనిషి లైఫ్ లో తాంబూలాలు, మ్యారేజ్, నామకరణం లాంటి శుభకార్యాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో తీసిన ఫొటోలను, వీడియోలను మధుర జ్ఞాపకాలుగా దాచుకుంటారు. అయితే గతంలో వీసీఆర్ క్యాసెట్‌లో అందుబాటులో ఉండేది. ప్రస్తుతం వీసీఆర్ ప్లేయర్స్ ఎవరి ఇళ్లలోనూ లేవు. కాలం మారుతున్న కొద్దీ సీడీలు, పెన్‌డ్రైవ్‌లు, చిప్‌లు మన జీవితంలోకి వచ్చి చేరాయి. ఈ పాయింట్‌ను బేస్ చేసుకొని దర్శకుడు నాగ శశిధర్ ఈ కథను రాసుకున్నాడు. దాన్ని చివరి కంటా అదే టెంపోను మెయింటెన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. వీసీఆర్ క్యాసెట్ నుంచి నుంచి సీడీకి, పెన్‌డ్రైవ్‌కు డేటాను ట్రాన్స్‌ఫర్ చేసే ప్రక్రియను ఈ
సినిమాలో అద్భుతంగా చూపించాడు. ఇది చిన్న సినిమా అయినా అపుడెపుడే 30 యేళ్ల క్రితం ప్రపంచం ఎలా ఉంది. ఇపుడు ఎలా మారిందనే విషయాలను ఇందులో ప్రస్తావించడం గమనార్హం. మన మనసుకు నచ్చిన పనిని ఇష్టంగా చేస్తే సక్సెస్ వరిస్తుందని చూపించాడు. బంధువులు అనేవాళ్లు మాటలు చెప్పడానికే కానీ, మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేందుకు పనికిరారనే జీవిత సత్యాన్ని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. అలాగే మనల్ని నమ్మిన స్నేహితులు మనల్ని ఎలా నమ్మించి మోసం చేస్తారనే జీవిత సత్యాన్ని కూడా ఈ సినిమాలో ప్రస్తావించాడు దర్శకుడు. ప్రస్తుతం సమాజంలో ఆడవాళ్లు సీరియల్స్ మాయలో పడి ఎలా బతుకుతున్నారో చూపించాడు.
ముఖ్యంగా తాను ఎంచుకున్న పాయంట్ కు తగ్గ కథ, కథనం విషయంలో మెప్పించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని గ్రిస్పింగ్ తో నడిపిన దర్శకుడు.. సెకండాఫ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండేది. అంతేకాదు ఈ సినిమాలో మెయిన్ పాత్రల్లో తెలిసిన వాళ్లు ఉంటే ఈ మూవీకి మరింత మైలేజ్ వచ్చేది. కొత్త రూట్లో సరికొత్త సందేశం ఇచ్చాడు దర్శకుడు నాగ శశిదర్. జీవితంలో ఓటమి అనేది సహజంగా తీసుకోవాలనే విషయం ఇప్పటి యూత్ కు కనెక్ట్ అవుతోంది. ఫోటోగ్రఫీ, ఆర్ఆర్ బాగున్నాయి. నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి. దర్శకుడు నాగ శశిధర్ కొత్త పాయింట్ ను కొత్త నటీనటులతో చేయడం బాగుంది. డైరెక్టర్ గా తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుతి మెత్తగా చెప్పాడు. అరుణ్ కుమార్ పర్వతనేని సినిమాటోగ్రఫీ కనువిందుగా ఉంది. .
నటీనటుల విషయానికొస్తే..
ఈ సినిమాలో హీరో పాత్రలో నటించిన లక్షణ మూర్తి తన పాత్రలో జీవించాడు. జీవితంలో సక్సెస్ కావాలి. మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు. టీమాస్టర్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. హీరోయిన్ గా నటించిన భ్రమరాంబిక తన గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది. మిగిలిన నటీనటుల తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
పంచ్ లైన్.. మనసుకు హాయి నిచ్చే ‘సీతారాం సిత్రాలు’
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.