7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ డీఏ పెంపు సెప్టెంబర్ నెలలో ఉండవచ్చు. ఎప్పుడెప్పుడా అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న జూలై నుంచి పెరగాల్సిన డీఏ పెంపు సెప్టెంబర్ నెలలో ఉండవచ్చని తెలుస్తోంది. ఈసారి 3 శాతం పెరిగితే 53 శాతానికి డీఏ చేరనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళికి ముందే బంపర్ బహుమతి అందనుంది. ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న డీఏ ప్రకటన వెలువడనుంది. వచ్చే నెల సెప్టెంబర్‌లో డీఏ పెంపు ఉండవచ్చని అంచనా. ఈసారి డీఏ 3 శాతం పెరగవచ్చనే అంచనాల నేపద్యంలో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకోనుంది. జూలై, ఆగస్టు నెల ఎరియర్లతో కలిపి సెప్టెంబర్ నెల జీతం అక్టోబర్ 1న ఉద్యోగులకు అందనుంది.
3 శాతం డీఏ, డీఆర్ పెంపు ప్రకటన సెప్టెంబర్ నెలలో ఉండవచ్చని తెలుస్తోంది. ఇది జూలై నుంచి అమల్లోకి రానుంది. మొత్తం డీఏ 53 శాతానికి చేరుకోనుంది. అయితే 50 శాతం దాటినా కనీస వేతనంతో కలిపి అవకాశాల్లేవు. డీఏ 50 శాతం దాటితే హెచ్ఆర్ఏ కూడా పెరగనుంది. డీఏ అనేది ఉద్యోగులకు ఇచ్చేది కాగా డీఆర్ అనేది పెన్షనర్లకు లబిస్తుంది. డీఏ, డీఆర్ పెంపు అనేది ఏడాదిలో రెండు సార్లు ఉంటుంది. ఒకటి ఏడాది ప్రారంభం జనవరిలో రెండవది జూలై నెలలో ఉంటుంది. జనవరిలో జరగాల్సిన డీఏ పెంపు మార్చ్ నెలలో 4 శాతం పెంపుతో ప్రకటన వెలువడింది. దాంతో డీఏ 50 శాతానికి చేరుకుంది. డీఆర్ కూడా 4 శాతం పెరిగింది.
18 నెలల పెండింగ్ డీఏ ఎప్పుడు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పట్నించో 18 నెలల డీఏ బకాయిల గురించి అడుగుుతన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం 18 నెలల డీఏ బకాయిలు చెల్లించే పరిస్థితి కన్పించడంలేదు. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం 18 నెలల వరకు డీఏ నిలిపివేసింది. ఈ డీఏను ఇప్పుడు విడుదల చేయాలనేది ఉద్యోగుల డిమాండ్. ఇదే విషయంపై పార్లమెంట్లో కొందరు ప్రశ్నించగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆ అవకాశం లేదని చెప్పారు. కోవిడ్ సమయంలో ఏకంగా మూడు సార్లు పెరగాల్సిన డీఏ నిలిచిపోయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook