Independence Day 2024: అంగరంగ వైభవంగా స్వాత్రంత్య దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి జరుగుతున్న స్వాతంత్ర్య సంబరాలు అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జెండావిష్కరణ చేసే వారి జాబితా విడుదలైంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడెక్కడ జెండావిష్కరణ చేస్తారో సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు వెలువరించింది. అయితే తొలిసారిగా మంత్రి హోదాలో పవన్ కల్యాణ్ ఎక్కడ జెండావిష్కరిస్తారోనని ఆసక్తి నెలకొంది.
Also Read: YS Viveka Murder Case: వైఎస్ జగన్ చెల్లెలు సంచలనం.. వైఎస్ వివేకా హత్యపై కీలక పరిణామం
రాష్ట్ర, జిల్లా స్థాయిలో స్వాతంత్య్ర వేడుకల నిర్వహణపై ఏపీ సాధారణ పరిపాలన శాఖ ప్రొటోకాల్ విభాగం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రస్థాయిలో నిర్వహించే వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో పాల్గొననున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
తొలిసారి మంత్రి హోదాలో పవన్
ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడలో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ జిల్లాలోనే పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఉన్న విషయం తెలిసిందే. కాకినాడలో కార్యక్రమం పూర్తయిన తర్వాత పిఠాపురంలో పవన్ పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలోనూ కూడా పవన్ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొననున్నారు. అన్ని జిల్లాల్లో మంత్రులు ఎగురవేయనుండగా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రం కలెక్టర్ జెండా ఆవిష్కరించనుండడం విశేషం.
Also Read: Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ నిబంధన ఉండదు..
జిల్లాల్లో జెండావిష్కరించే మంత్రులు వీరే..
- ఎన్టీఆర్ జిల్లా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
- కాకినాడ జిల్లా ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్
- గుంటూరు జిల్లా మంత్రి నారా లోకేష్
- శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు
- కృష్ణా జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర
- పల్నాడు జిల్లా మంత్రి నాదెండ్ల మనోహర్
- నెల్లూరు జిల్లా మంత్రి పొంగూరు నారాయణ
- అనకాపల్లి జిల్లా మంత్రి అనిత
- చిత్తూరు జిల్లా మంత్రి సత్యకుమార్ యాదవ్
- పశ్చిమ గోదావరి జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడు
- కడప జిల్లా మంత్రి ఫరూక్
- తిరుపతి జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
- అనంతపురం జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్
- విశాఖ జిల్లా మంత్రి అనగాని సత్యప్రసాద్
- ఏలూరు జిల్లా మంత్రి కొలుసు పార్థసారధి
- ప్రకాశం జిల్లా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి
- బాపట్ల జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్
- తూర్పు గోదావరి జిల్లా మంత్రి కందుల దుర్గేష్
- పార్వతీపురం మన్యం జిల్లా మంత్రి సంధ్యారాణి
- నంద్యాల జిల్లా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
- కర్నూలు జిల్లా మంత్రి టీజీ భరత్
- సత్యసాయి జిల్లా మంత్రి సవిత
- అమలాపురం జిల్లా మంత్రి వాసంశెట్టి సుభాష్
- విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- అన్నమయ్య జిల్లా మంత్రి మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి